– మేనిఫెస్టో హామీలను నెరవేర్చటంలో టీడీపీ విఫలం
– కార్యకర్తలకు దోచిపెట్టేందుకే నీరు–చెట్టు పనులు
– ప్రధానిని జగన్‌కలువటంతో టీడీపీ నేతలకు వణకు పడుతోంది
– పార్టీ ప్లీనరీ సమావేశాలకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలి
– మండల స్థాయి పార్టీ ప్లీనరీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి
చాపాడు:మూడేళ్ల పరిపాలనలో టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రతి కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ నేత, మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి పేర్కొన్నారు. స్థానిక విజేత హైస్కూల్‌ఆవరణలో బుధవారం వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశాల్లో భాగంగా మండల స్థాయిలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, అన్ని విధాలుగా ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. కార్యకర్తలకు దోచిపెట్టేందుకు నీరు–చెట్టు పనులను పెట్టారే తప్ప ప్రజలకు, రైతులకు ఉపయోగపడే ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేదన్నారు. రైతుల, డ్వాక్రా మహిళల రుణమాఫీ చేయకుండా నిలువునా మోసం చేశాడని, నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వలేదని, నిరుద్యోగ భృతి లేకుండా ఉన్న ఉద్యోగాలను సైతం తొలగిస్తున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రధాని నరేంద్ర మోడిని జగన్‌మోహన్‌రెడ్డి కలవగా ఆ పార్టీ నాయకులు వణకి పోతున్నారన్నారు. దేశంలో ఎక్కడా జరుగని అవినీతి, దుర్మార్గపు పరిపాలను ఇక్కడ జరుగుతోందని, దీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌చాపాటి రాజశేఖరరెడ్డి, ఉప మండలాధ్యక్షులు సాన నరసిహారెడ్డి, రాష్ట్ర జాయింట్‌సెక్రటరి శంకర్‌రెడ్డి, ఎంపీటీసీలు ఎల్లారెడ్డి, మహేష్‌యాదవ్, బీసీ సెల్‌సెక్రెటరి దస్తగిరి, నాయకులు మాజీ సర్పంచ్‌లు కుచ్చుపాప లక్షుమయ్య, రామోహన్‌రెడ్డి, కర్నాటి నారాయణరెడ్డి, సర్పంచ్‌లు రామాంజనేయులరెడ్డి, సర్పంచ్‌బొంతుపల్లె వెంకటసుబ్బారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, సీవీ సుబ్బారెడ్డి, జయరామిరెడ్డి, రామచంద్రయ్య,మల్లికార్జనరెడ్డి, జయసుబ్బారెడ్డి, ఓబాయపల్లె వెంకటసుబ్బారెడ్డి, కేతవరం జయరాజు, రామయచంద్రయ్య, మురళీశ్వర్‌రెడ్డి, రమణారెడ్డి, జైనుల్లా, శౌరెడ్డి తదితరులు పాల్గొన్నారు.