అన్నింటా ప్రభుత్వ వైఫల్యం..!


హైదరాబాద్)
అన్నిరంగాల్లో చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యం చెందిందని ప్రతిపక్ష నేత,
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో హామీలు
ఇచ్చి  తర్వాత మాట తప్పారని సోదాహరణంగా
వివరించారు. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం మీద చర్చ సందర్బంగా ప్రతిపక్ష నేత వైఎస్
జగన్ మాట్లాడారు.

ప్రజలకు
ఎన్నెన్నో సమస్యలు

ఎన్నికలకు ముందు ఇంటింటికీ వెళ్లి మ్యానిఫెస్టో లో అంశాల్ని కరపత్రాలుగా
పంచారు. ఎన్నికలకు ముందు టీవీ ఆన్ చేస్తే ఒకటే కనిపించేది. బ్యాంకుల్లో పెట్టిన
బంగారం ఇంటికి రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి. రైతుల రుణాలన్నీ
స్వచ్ఛందంగా పూర్తిగా మాఫీ కావాలంటే బాబు అధికారంలోకి రావాలి. చంద్రబాబు స్వయంగా
సంతకాలు పెట్టి పంపించాడమ్మా అంటూ తెలుగుదేశం కార్యకర్తలు ఇంటింటికీ పంచారు. రైతుల
రుణాలన్నీ మాఫీ అవుతున్నాయంటూ చంద్రబాబు చెప్పిన మాటల్ని పూర్తిగా నమ్మి ఓట్లేసి,
అప్పులు కట్టడం మానేశారు. అప్పటి దాకా సకాలంలో అప్పు తీరిస్తే వడ్డీ ఏమాత్రం పడేది
కాదు. కానీ, ఇప్పుడు చంద్రబాబు పుణ్యమా అని అప్పు కట్టకపోతే, అపరాధ వడ్డీ
కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. 14 నుంచి 18 దాకా అపరాధ వడ్డీ కట్టాల్సిన
పరిస్థితి ఏర్పడటంతో 87 వేల 612 కోట్ల రూపాయిల   అసలు మీద
వడ్డీ 24 వేల కోట్ల రూపాయిల దాకా పడుతోంది. దీనికి గాను చంద్రబాబు కేటాయించిన
రుణమాఫీ రూ. 7,300 కోట్ల రూపాయిలు కేటాయించారు. ఏ రకంగానూ మొత్తం వడ్డీలో మూడో
వంతుకి కూడా సరిపోవటం లేదని చెబుతున్నారు.  చేనేతకు సంబంధించి ఏ హామీలు ఇవ్వలేదు. ధర్మవరం
వెళితే 12 కుటుంబాల్ని పరామర్శించాను. ఏ కుటుంబానికి సరైన పరిహారం ఇవ్వలేదు.

మహిళలకు కుచ్చు టోపీ

మహిళల పరిస్థితి అంతే. బ్యాంకుల్లో పెట్టిన బంగారం తిరిగి రావాలంటే చంద్రబాబు
అధికారంలోకి రావాలని ప్రచారం చేశారు. ఇప్పుడు బంగారం తిరిగి రాలేదు. కానీ వేలం
వేస్తున్నారని ప్రతీ రోజూ పేపర్ లో ప్రకటనలు వస్తున్నాయి. దీని మీద మాట్లాడే
పరిస్థితి లేదు.  డ్వాక్రా అక్క చెల్లెమ్మల పరిస్థితి
చూసుకొంటే... దాదాపు 25 శాతం దాకా స్వయం సహాయక బ్రందాలు చేతన స్థితిలో లేవని
తేలింది. దీన్ని చూస్తే దాదాపు పావు వంతు సంఘాలు చతికిలపడుతున్నాయి అని అర్థం
అవుతోంది. ప్రభుత్వ అధికారిక సంస్థ సెర్ప్ వెబ్ సైట్ లో పరిస్థితి చూస్తే..  ఆరు లక్షల 85 వేల గ్రూపులు ఉంటే.. బాగా
పనిచేస్తున్న గ్రూపుల శాతం 12 ఉన్నాయి. చివరి స్థాయిలో ఉన్న గ్రూపుల శాతం 54 ఉంది
. అంటే చంద్రబాబు మాటలు నమ్ముకొన్నందుకు గాను మహిళా స్వయం సహాయక గ్రూపులు
చతికిలపడుతున్నాయి.

       ఛివరకు చంద్రబాబు
నమ్ముకొన్నందుకు గాను రైతులు, మహిళలకు రుణాలు మాఫీ కాలేదు. దీంతో అప్పులు
కట్టలేకపోయారు. దీంతో అప్పులు రెన్యూవల్ కాలేదు. అంతిమంగా క్రాప్ ఇన్సూరెన్స్
కాలేదు. బ్యాంకులలో సున్న వడ్డీ కి, పావలా వడ్డీ కి అప్పు లు దొరికే పరిస్థితి
లేనే లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక కరువు మళ్లీ మొదలైంది. వరదలు
వచ్చిపడ్డాయి. కష్టాల్లో ఉన్న రైతుల్ని ఆదుకొనేందుకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి
ఉంది. అందులోనూ చంద్రబాబు ప్రభుత్వం దివాళాకోరుతనం బయట పడింది.  

కేంద్ర నిధుల మళ్లింపు

       2013..14 లో రైతులకు 1,650
కోట్లు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉంది. దాన్ని ఇచ్చేది లేనే లేదని తేల్చి
చెప్పారు. తర్వాత 2014..14 లో మొత్తంగా 566 మండలాల్లో దుర్భిక్షం నెలకొందని
జిల్లాల కలెక్టర్లు నివేదికలు ఇచ్చారు. మొత్తం 15 వందల కోట్ల రూపాయిలు దాకా సహాయం
చేయాలని అడిగారు. కానీ దీనికి రక రకాల వంకలు పెట్టి దుర్భిక్ష మండలాల్ని 238 కు
కుదించారు. అప్పుడు రూ. 1,067 కోట్లకు తగ్గించారు. తర్వాత జూలై సమావేశంలో తగ్గించి
రూ. 692 కోట్లకు మాత్రమే చేశారు. పైగా అందులో రూ. 80 కోట్లను పెండింగ్ పెట్టారు.

       తర్వాత 2015..16 ఆర్థిక
సంవత్సరంలో కరవు, వరదలు వచ్చాయి. దాదాపుగా రూ. 1,021 కోట్లు ఇవ్వాల్సి ఉండగా
ఇప్పటి దాకా దమ్మిడీ ఇవ్వనే లేదు. రైతులకు పరిస్థితి దారుణంగా తయారైంది.
స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తామని చెప్పారు. అంటే ఆ సిఫార్సుల ప్రకారం
చూస్తే రైతులు పెట్టిన పెట్టుబడి లో దాదాపు 50శాతం పెంచి మద్దతు ధర ను ఇవ్వాల్సి
ఉంటుంది.

ఉద్యోగాలేవి బాబూ

ప్రతీ ఇంటికీ ఉద్యోగం ఇస్తామని చెప్పారు. జాబ్ లేదంటే భ్రతి ఇస్తామని కూడా
చెప్పారు. దీని కోసం కోటీ 75 లక్షల ఇళ్లు ఎదురు చూస్తున్నాయి. డీ ఎస్సీ రాసి 18
నెలలుగా మెరిట్ లిస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడ ఉద్యోగాల కోసం జనం ఎదురు
చూస్తుంటే క్లస్టర్ స్కూల్స్ పెట్టి పాఠశాలల్ని కుదించారు. దీంతో 7వేల దాకా
పోస్టులు అదనంగా ఉన్నట్లు లెక్క తేలుస్తున్నారు. మొత్తంగా చూస్తుంటే రిక్రూట్
మెంట్ క్యాలండర్లు లేనే లేవు.

కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు దాదాపు 2 లక్షల మంది దాకా ఎదురు
చూస్తున్నారు. ఎప్పుడు ఉద్యోగాలు పోతాయో అని భయపడుతూ బతుకుతున్నారు. మ్యానిఫెస్టో
లో అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని పిలుపు ఇచ్చారు. ఇప్పుడు మాత్రం పరిశీలిస్తాం
అని ప్లేటు ఫిరాయిస్తున్నారు.  ఆరోగ్య మిత్ర, ఆదర్శ రైతుల్ని
తొలగించారు. గోపాల మిత్రలను తొలగించారు. అంగన్ వాడీ, ఆశ వర్కర్లు జీతాలు పెంచమంటే
ఉక్కు పాదంతో అణచివేస్తున్నారు.

ఎన్నికల మ్యానిఫెస్టో లో ఇచ్చిన హామీలన్నీ అలాగే వదిలేశారు. వాటిని అమలు
చేయకుండా మోసాలు చేస్తున్నారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నిలదీశారు. 

Back to Top