దివ్యాంగుల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం

నెల్లూరు: దివ్యాంగులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందేందుకు నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గ పరిధిలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన దివ్యాంగుల వైద్య శిబిరానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మిషన్లు, ట్రైసైకిళ్లు, హ్యాండ్‌ స్టిక్స్‌లను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వికలాంగులకు, అనాధలకు మనం అండగా ఉంటే.. దేవుడు మన కుటుంబాలకు అండగా ఉంటాడన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా వారి వద్దకు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. దివ్యాంగులకు  పక్కా ఇళు, ఉపాధి హామీ పథకాలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా ప్రభుత్వ రుణాలు మంజూరు చేయాలని కోరారు. వికలాంగుల సమస్యలపై తక్షణమే స్పందించేందుకు టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. 

ఎంపీ మేకపాటికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు
దివ్యాంగుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టిన నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. వికలాంగుల సమస్యలపై వెంటనే స్పందించిన ఎంపీకి నియోజకవర్గ ప్రజలంతా రుణపడి వుంటారన్నారు. 
Back to Top