ప్రభుత్వ వైద్యుల తీరు మారాలి

నెల్లూరు) ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటూ
 కార్పొరేట్‌ ఆసుపత్రిలో డాక్టర్లుగా పనిచేస్తే సహించేది లేదని నెల్లూరు రూరల్‌
నియోజకవర్గ వైయస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. ఎస్‌.
దర్గామిట్టలోని ప్రభుత్వ పెద్దాసుపత్రిని సోమవారం ఎమ్మెల్యే తనిఖీ చేశారు. మెడికల్‌
కళాశాల టీచింగ్‌ ఆసుపత్రి అభివద్ది కమిటీ ఛైర్మన్‌ చాట్లనరసింహారావు,  ప్రిన్సిపాల్‌ డా.రవిప్రభు, సూపరింటెండెంట్ డా. భారతి, ఇతర డాక్టర్లతో సమావేశమయ్యారు. ఎమ్మెల్యే
మాట్లాడుతూ ఆసుపత్రి సమయంలో డాక్టర్లు బయట ఎలా ప్రాక్టీసు చేస్తారని నిలదీశారు.  . సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భారతి స్పందిస్తూ
నెట్‌ పని చేయడంలేదని,
మిషన్‌లో
డాక్టర్ల పేర్లు  మిస్‌ మ్యాచ్‌ అవుతున్నాయని తెలిపారు. దీంతో ఎమ్మెల్యే
ఆగ్రహం వ్యక్తం చేస్తూ నెట్‌ సమస్యను ఒక్క రోజులో పరిష్కరించుకోవచ్చన్నారు. మళ్లీ
తనిఖీలకు వస్తానని ఈలోపు  బయోమెట్రిక్‌ పని చేయాలన్నారు. కార్పొరేట్‌
ఆసుపత్రిల్లో ప‌నిచేసే డాక్ట‌ర్ల‌ను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంటామని
హెచ్చరించారు. అదనపు పారిశుధ్య సిబ్బంది పూర్తిగా పనిలోకి వచ్చారా అని అధికారుల‌ను
అడిగి తెలుసుకున్నారు.  ప్రభుత్వం నెలకు పారిశుధ్యం కోసం రూ.28 లక్షలు ఖర్చు చేస్తుందన్నారు. పందులు, కుక్కలు, ఎలుకలు, ఎన్ని పట్టుకున్నారంటూ రికార్డును తనిఖీ
చేశారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారు పేదల్లో మరీ నిరుపేదలని వారికి మెరుగైన
 వైద్య సేవలందించాల‌ని తెలిపారు.  డాక్టర్లు సమయపాలన పాటించి రోగులకు
సేవలందిస్తే విమర్శలు రావన్నారు.  ప్రమాదాల్లో మరణించినప్పుడు వేగంగా
 పోస్టు మార్టం నిర్వహించి త్వరిత గతిన దేహాలను అప్పగించాలని సూచించారు. ఆసుపత్రి
కమిటీ ఛైర్మన్‌ చాట్ల నరసింహారావు ఎమ్మెల్యేకు కండువా వేసి ఆహ్వానించారు.
కార్యక్రమంలో కార్పొరేటర్‌ బొబ్బల శ్రీనివాసయాదవ్, వైసిపి నాయకులు జిల్లా అధికార
ప్రతినిధిశ్రీకాంత్‌రెడ్డి,
నగర అధ్యక్షుడు
 తాటి వెంకటేశ్వరరావు,
 పర్వతాల
శ్రీనివాసులు,
డిప్యూటి
సూపరింటెండ్‌ డా.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

 

Back to Top