కుట్రలకు పరాకాష్ట

గుంటూరుః రాష్ట్ర ప్రజానీకమంతా ఛీదరించుకుంటున్నా చంద్రబాబు అండ్ కో బుద్ధిమారడం లేదు. ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్  పోరాటాలపై చంద్రబాబు కుట్రల మీద కుట్రలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా హెల్త్ రిపోర్ట్ ల ట్యాంపరింగ్ కుట్ర ను వైఎస్ జగన్ స్వయంగా బట్ట బయలు చేశారు.

ప్రతీ రోజూ ప్రభుత్వ డాక్టర్లు తెస్తున్న గ్లూకో మీటర్ ఒక్కో మాదిరి రీడింగ్ ఇస్తోంది. దీంతో ఆదివారం రాత్రి వైఎస్ జగన్ ఒక కొత్త గ్లూకో మీటర్ తెప్పించి పెట్టారు. మొదటగా ప్రభుత్వ డాక్టర్లు తెచ్చిన దొంగ గ్లూకో మీటర్ తో రీడింగ్ 88 గా చూపించింది. అప్పుడు సీల్డ్ కవర్ లో ఉన్న గ్లూకో మీటర్ బయటకు తెరిచి చూస్తే 77 గా నమోదైంది. దీంతో అందరి ముందు ప్రభుత్వం చేస్తున్నకుట్రలు బట్ట బయలు అయ్యాయి. పైగా శ్యాంపిల్స్ ను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకొని వెళ్లి అక్కడ మరో సారి ట్యాంపర్ చేస్తున్నారు. కీటోన్స్ వివరాల మీద కూడా రక రకాల రిపోర్టులు బయట పెడుతున్నారు. దీని మీద కూడా వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
Back to Top