వైయస్సార్సీపీ ఆందోళనలతో దిగొచ్చిన సర్కార్..నీటి విడుదల

గుంటూరు : సాగునీటి విడుదల కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నాకు పిలుపునివ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. నాగార్జున సాగర్ జలాశయం కుడి కాలువకు బుధవారం ఉదయం అధికారులు నీటిని విడుదల చేశారు. కుడికాల్వకు 5వేల క్యూసెక్కుల నీరు విడుదల కాగా, ఈ నీరు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 8.35 లక్షల ఎకరాల్లోని పంటలకు అందుతుంది. రోజుకు 10 టీఎంసీల చొప్పున 25 రోజులపాటు విడుదల కొనసాగనుంది. సాగునీటి విడుదల కోసం వైయస్ఆర్ సీపీ ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఇవాళ వినుకొండ, నర్సరావుపేటలో మహాధర్నాకు నేతలు పిలుపునిచ్చారు. ధర్నా పిలుపుతో సర్కార్లో చలనం వచ్చి సాగునీటిని విడుదల చేశారు.

Back to Top