నాసిరకం విత్తనాలతో నట్టేట ముంచుతున్న ప్రభుత్వం

అమడగూరు : ఖరీఫ్‌ సాగుకు ప్రభుత్వం నాశిరకం విత్తనాలను పంపిణీ చేయిస్తూ రైతులను నట్టేట ముంచుతోందని వైయస్సార్సీపీ పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మహమ్మదాబాద్‌లో ఓ శుభకార్యానికి ముఖ్య అథితిగా విచ్చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధికార పార్టీ టీడీపీ అవలంబిస్తున్న విధివిదానాలపై దుమ్మెత్తి పోశారు. రైతులు అధిక ఖర్చులు చేసి బాడుగలు చెల్లించి పొలాలను దుక్కి చేసుకుంటే ప్రతి ఏటా నాశిరకం విత్తనాలను పంపిణీ చేయిస్తూ రైతుల నడ్డి విరుస్తోందని దుయ్యబట్టారు. ప్రస్తుతం చేతిలో చిల్లిగవ్వ లేక రాష్ట్రంలో రైతుల పరిస్థితి ధారుణంగా ఉందని, ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంట నష్టం భీమా ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అంతేకాక కేంద్రప్రభుత్వం ఇచ్చే భీమాతో లింక్‌ పెట్టి ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలని చూడటం సిగ్గుచేటన్నారు. ఈ ప్రాంతంలో బతకలేక ఎంతోమంది ఇతర ప్రాంతాలకు వలసలు వెళితే ప్రభుత్వం చూస్తూ ఊరుకుందని మండిపడ్డారు. పక్కరాష్ట్రం తెలంగాణా ముఖ్యమంత్రిని చూసి పాలన ఎలా చేయాలో నేర్చుకోవాలన్నారు. అలాగే అక్కడ అవలంబిస్తున్న విధివిధానాలను పాటిస్తే రైతుల భవిష్యత్తు మెరుగు పడుతుందన్నారు. కార్యక్రమంలో అమడగూరు, నల్లమాడ కన్వీనర్లు శేషూరెడ్డి, రామాంజినేయులు, జిల్లా కమిటీ నాయకులు, ఉత్తప్ప, రాజారెడ్డి, నక్కలచిన్నప్ప, మీసాల నాగరాజు, పకీర్‌రెడ్డి, జయప్ప, రమేష్, సుభక్తుల్లా, రషీద్‌ఖాన్, సూరి, గోపి, అంజినప్ప, లక్ష్మిరెడ్డి, సుధాకర్‌రాజు, రంగారెడ్డి, మౌళాళి, చలపతి, జయంత్, రాంప్రసాద్‌రెడ్డి, అమర, తబ్రేజ్, తదితరులు పాల్గొన్నారు.

Back to Top