ప్రభుత్వ తీరు దారుణం

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించాలని పార్టీలు, యువత, మహిళలు, రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, అన్ని వర్గాలవారు కోరుకుంటుంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గణతంత్ర దినోత్సవం రోజున ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నారని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి విమర్శించారు. చంద్రబాబు సీనియర్ నాయకుడిగా ఉండి ఇలా వ్యవహరించడం దారుణమని ఆమె అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ గురువారం విశాఖపట్నం ఆర్కే బీచ్లో కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనకుండా పోలీసులు నాయకులను, ప్రజలను అడ్డుకోవడంపై ఆమె నిరసన వ్యక్తం చేశారు.

Back to Top