గౌరు వెంకట్ రెడ్డి నామినేషన్ దాఖలు

కర్నూలు : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఐజయ్య, గౌరు చరిత, బాలనాగిరెడ్డి, సాయిప్రసాద్‌ రెడ్డి, పార్టీ నేతలు గంగుల ప్రభాకర్‌ రెడ్డి, కాటసాని రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.వాస్తవానికి కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో వైయస్‌ఆర్‌ సీపీ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉంది. కాగా అధికారపార్టీ నుంచి ఇప్పటివరకూ అభ్యర్థి ఖరారు కాలేదు. మరోవైపు నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల కోటా మండలి ఎన్నికలకు వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థిగా ఆనం విజయకుమార్‌రెడ్డి పేరు ఖరారు అయింది.

Back to Top