ముగిసిన ఎమ్మెల్యే గోపిరెడ్డి పాదయాత్ర

తిరుమల: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలంటూ గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ  ఎమ్మెల్యే గోపిరెడ్డి చేపట్టిన పాదయాత్ర ముగిసింది. అక్టోబర్‌ 21వ తేదీన నరసరావుపేట నుంచి ఎమ్మెల్యే పాదయాత్ర చేపట్టారు. దాదాపు 13 రోజుల పాటు సాగిన పాదయాత్ర తిరుమలకు చేరింది. ఈ సందర్భంగా గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలో రైతులు, కూలీలు, విద్యార్థులు, నిరుద్యోగులు చంద్రబాబు పాలనతో విసిగిపోయారన్నారు. ప్రజల సమస్యలు తీరాలంటే దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి సువర్ణపాలన మళ్లీ తిరిగిరావాలన్నారు. రాజన్న పాలన జగనన్నతోనే సాధ్యమన్నారు. ప్రతి ప్రాంతంలో పాదయాత్రకు బ్రహ్మరథం పట్టిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 

Back to Top