వైయస్సార్‌ సీపీ నాయకుడికి ఎమ్మెల్యే నివాళి

రొంపిచర్ల : మండలంలోని బుచ్చిబాపన్నపాలెం గ్రామానికి చెందిన వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బీసీ విభాగం నాయకుడు ఇర్లా పెదవెంకటయ్య మృతదేహాన్ని(70) ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సందర్శించి నివాళులు అర్పించారు. పెదవెంకటయ్య గుండెపోటుతో మృతిచెందాడు. పెదవెంకటయ్య కుంటుంబ సభ్యులకు ఎమ్మెల్యే సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే వెంట మండల పార్టీ అ«ధ్యక్షుడు పచ్చవ రవీంద్రబాబు, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి పిల్లి ఓబులరెడ్డి, కార్యదర్శి అన్నెం పున్నారెడ్డి, గ్రామ సర్పంచ్‌ గజ్జల ముసలారెడ్డి తదితరులున్నారు.

Back to Top