గోపాల్‌రెడ్డి గెలుపు తథ్యం

అనంతపురం: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి గెలుపు తథ్యమని పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎల్‌ఎం మోహన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కణేకల్లు మండలంలో వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఎల్‌ఎం మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ అక్రమాలు, ప్రజల సొమ్ము దోపిడి, ఆ పార్టీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలను పట్టభద్రులకు వివరించి ఈ ఎన్నికల్లో వెన్నపూస విజయానికి కృషి చేయాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కెజె రెడ్డిని ఒడించి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఈకార్యక్రమంలో మాజీ జెడ్‌పీటీసీ పాటిల్‌ నాగిరెడ్డి, పార్టీ మండల కన్వీనర్‌ ఆలూరు చిక్కణ్ణ, సేవాదళ్‌ కన్వీనర్‌ కె.విక్రంసింహారెడ్డి, నాయకులు పాటిల్‌ చెన్నకేశవరెడ్డి, టీ.కేశవరెడ్డి, జీఎంఎస్‌ సర్మస్, తిప్పారెడ్డి, కుండా హనుమంతరెడ్డి, గంగలాపురం మృత్యుంజయ్య, జీలాన్, రామ్మోహన్‌రెడ్డి, బాషా తదితరులు పాల్గొన్నారు.

Back to Top