కొత్త సంవత్స‌రంలో పార్టీకి శుభ ఫ‌లితాలు


హైద‌రాబాద్‌) దుర్ముఖి నామ సంవ‌త్స‌రంలో వైఎస్సార్సీపీ కి శుభ ఫ‌లితాలు ఉంటాయ‌ని ప్ర‌ముఖ పంచాంగ క‌ర్త మారేప‌ల్లి రామ‌చంద్ర శాస్త్రి అభిప్రాయ ప‌డ్డారు. ప్ర‌జ‌ల త‌ర‌పున పోరాడే పార్టీగా, ప్ర‌జ‌ల‌కు మేలు క‌లిగించే విధంగా పార్టీ పురోగ‌మిస్తుంద‌ని ఆయ‌న అన్నారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాల‌యంలో ఉగాది వేడుక‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా పార్టీ వేదిక‌గా పంచాంగ శ్ర‌వ‌ణం నిర్వ‌హించారు. క‌డిగిన ముత్యం లా వైఎస్ జ‌గ‌న్ బ‌య‌ట‌కు వ‌స్తార‌ని, రాజ‌కీయాల్లో సూప‌ర్ స్టార్ లా వెలుగొందుతార‌ని ఆయ‌న అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో పార్టీ అధ్య‌క్షులు వైఎస్ జ‌గ‌న్, గౌర‌వ అధ్య‌క్షులు విజ‌య‌మ్మ‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి, తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు. 
Back to Top