మాక్ ఎంసెట్‌కు విశేష స్పంద‌న‌

- వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వ‌ర్యంలో మోడ‌ల్ ఎంసెట్‌
- మ‌హానేత వైఎస్సార్ స్ఫూర్తితో సేవా కార్య‌క్ర‌మాలు
- వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు స‌లాంబాబు
గుంటూరు:  కేవ‌లం రాజ‌కీయాల‌కు ప‌రిమితం కాకుండా విద్యార్థుల‌ను చైత‌న్య‌వంతులుగా త‌యారు  చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వ‌హించిన మాక్ ఎంసెట్‌కు విశేష స్పంద‌న వ‌చ్చింది. మూడు రోజులుగా రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లో మాక్ ఎమ్ సెట్ ను నిర్వహిస్తున్నారు. శనివారం నాడు తూర్పుగోదావరి జిల్లా, వైఎస్సార్ జిల్లా, గాజువాక సెగ్మంట్ లో పరీక్ష జరుగుతోంది. 
 గుంటూరు ఏసీ క‌ళాశాల‌లో  మాక్ ఎంసెట్ ప‌రీక్ష ప్ర‌శ్న ప‌త్రాన్ని వైఎస్సార్‌సీపీ కార్యదర్శి  లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎస్‌యూ రాష్ట్ర అధ్య‌క్షుడు స‌లాంబాబు, గుంటూరు జిల్లా అధ్య‌క్షుడు పానుగంటి చైత‌న్య‌ల‌తో క‌లిసి విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.... విద్యార్థుల‌ను విద్యాప‌రంగా ముందుకు తీసుకెళ్లే బాధ్య‌త వైఎస్సార్‌సీపీ ఎస్‌యూ చేప‌డుతుంద‌న్నారు. పేద విద్యార్థులు చ‌దువుకు దూరం కావొద్ద‌నే ఆలోచ‌న‌తో దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఫీజు రియంబ‌ర్స్‌మెంట్ ప‌థ‌కం ద్వారా ఎంతో మంది నిరుపేద‌ల‌కు ఉన్న‌త విద్య‌ను అందించార‌న్నారు. అదేవిధంగా మైనార్టీల‌కు నాలుగు శాతం రిజర్వేష‌న్‌లు క‌ల్పించార‌న్నారు. వైఎస్సార్ స్ఫూర్తితో, పార్టీ అధ్య‌క్షులు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నాయ‌క‌త్వంలో విద్యార్థి విభాగం కూడా విద్యార్థుల‌కు ఉప‌యోగ‌ప‌డే కార్య‌క్ర‌మాలు చేస్తోంద‌న్నారు. పార్టీ విద్యార్థి విభాగం నాయ‌కుల‌ను ఆయ‌న అభినందించారు. 
విద్యార్థుల‌కు వైఎస్సార్‌సీపీ ఎస్‌యూ అండ‌
విద్యార్థుల‌కు ఉప‌యోగ‌ప‌డే ఎలాంటి కార్య‌క్ర‌మాలకైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుంద‌ని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు స‌లాంబాబు స్ప‌ష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ అధ్య‌క్షుడు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశాల మేర‌కు మాక్ఎంసెట్ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నామ‌ని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ ఎస్‌యూ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించే మాక్ఎంసెట్‌లో 40వేల మందికిపైగా విద్యార్థులు పాల్గొంటున్నార‌ని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో విద్యార్థుల‌కు, నిరుద్యోగుల‌కు అండ‌గా నిల‌బ‌డి ప్ర‌త్యేక హోదా, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ‌భృతి వంటి వాటిని సాధించుకునేందుకు పోరాటం చేస్తామ‌ని ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు. ఇలాంటి కార్య‌క్ర‌మాలు మ‌రెన్నో నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. 
పరీక్ష కీ లభ్యం
మాక్ ఎమ్ సెట్ కు సంబంధించిన కీ ను వైఎస్సార్సీపీ అధికారిక వెబ్ సైట్ www.ysrcongress.com లో ఉంచటం జరిగింది. దీన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చని విద్యార్థి విభాగం అధ్యక్షులు సలామ్ బాబు వెల్లడించారు. 
 
Back to Top