డిజిటల్ మిత్రులకు శుభవార్త

హైదరాబాద్) వైయస్సార్సీపీ అధికారిక ఫేస్ బుక్ పేజీ ( https://www.facebook.com/ysrcpofficial )6 లక్షల బెంచ్ మార్క్ దాటింది. డిజిటల్ వర్గాల్లో ఆనందోత్సాహాన్ని నింపింది.
వైయస్సార్సీపీ సిద్ధాంతాలు, పోరాటాలు, కార్యక్రమాల్ని ప్రజల దగ్గరకు చేర్చటంలో డిజిటల్ మీడియా విభాగం చురుగ్గా పనిచేస్తోంది. ఈ క్రమంలో పార్టీ అధికారిక ఫేస్ బుక్ పేజీ విస్తారంగా పోస్టులు, వీడియోలు, ఫోటోల్ని నెటిజన్లకు చేర్చుతోంది. దీంతో అనతికాలంలోనే విశేష ఆదరణ చూరగొంది. ఈ క్రమంలో గత ఏడాది మే నెలలో 5లక్షల బెంచ్ మార్క్ ను దాటింది. తర్వాత ఏడాదిన్నరలోనే మరో లక్ష లైక్ లను సాధించి 6లక్షల బెంచ్ మార్క్ ను అధిగమించింది. ఈ విజయానికి తోడ్పడిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు డిజిటల్ మీడియా విభాగం ధన్యవాదాలు తెలిపింది. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top