చంద్రబాబు ఏరు దాటాక తెప్పతగలేసే రకం..!

విశాఖపట్నం: వైఎస్సార్సీపీ నాయకుడు గొల్లపల్లి బాబూరావు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బాక్సైట్ తవ్వకాలపై ఎన్నికలకు ముందొక మాట, తర్వాత మరోమాట చెప్పడం చంద్రబాబుకే చెల్లిందని విమర్శించారు. చంద్రబాబుది ఏరు దాటాక తెప్పతగలేసే తీరని బాబూరావు ధ్వజమెత్తారు. బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో నంబర్ 97కు నిరసనగా అఖిలపక్షం పిలుపు మేరకు విశాఖలో  మన్యం బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా గొల్లపల్లి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. 

ఏపీలో మోసాలు, దోపిడీల పరంపర కొనసాగుతున్నదని బాబూరావు అన్నారు. మన్యంలో జరుగుతున్న బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా అఖిలపక్షం చేస్తున్న పోరాటంలో మంత్రులు కూడా కలిసిరావాలని డిమాండ్ చేశారు. గిరజన హక్కులను కాపాడేందుకు వైఎస్సార్ సీపీ నిరంతరం పోరాడుతుందని, అవసరమైతే ప్రాణత్యాగాలకు కూడా వెనకాడబోదని గొల్లపల్లి స్పష్టం చేశారు.
Back to Top