రైతులను పట్టించుకోని టీడీపీ ప్రభుత్వం

విశాఖ‌!  ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో గోకివాడ గ్రామస్తులు వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. రైతుల కోసం దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి చేపట్టిన గోకివాడ ఆనకట్ట  అభివృద్ధి పనులు  మ‌హానేత‌ మరణం తర్వాత నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆనకట్ట పూర్తయితే సుమారు 20 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందన్నారు. వైయస్‌ జగన్‌ వస్తే ఆనకట్ట అభివృద్ధి జరుగుతుందని రైతులంతా ఆశిస్తున్నామన్నారు. శారద నది గట్లు కూడా బలహీనంగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. దీని వరదల సమయంలో వేలాది ఎకరాలు ముంపునకు గురువుతున్నాయన్నారు. గట్టు పటిష్టానికి చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పొలాల్లోకి వెళ్లడానికి  బ్రిడ్జి లేదని, వారధి నిర్మిస్తే రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ సారి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారంలోకి రావడం ఖాయమని, ఆయనతోనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని బలంగా విశ్వసిస్తున్నామని రైతులు అన్నారు. 
Back to Top