గోదావరి ఉప్పొంగిందా..

జననేతకు వీడ్కోలు పలికేందుకు జనసంద్రమైన కొవ్వూరు
స్వాగతం పలికేందుకు సిద్ధమైన తూర్పు జనం
కొవ్వూరు: ప్రపంచంలోనే అత్యంత ప్రజాకర్షణ కలిగిన నాయకుడు వైయస్‌ జగన్‌ ఒక్కరేనని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కొవ్వూరు నియోజకవర్గ నాయకులు అభిప్రాయపడ్డారు. వైయస్‌ జగన్‌ ప్రజల శ్రేయస్సు కోసం చేస్తున్న పాదయాత్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లికించబడి ఉంటుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర ముగించుకొని తూర్పు గోదావరిలో అడుగుపెడుతున్న జననేతకు వీడ్కోలు పలికేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున కొవ్వూరు చేరుకున్నారు. దాదాపు 50 వేల మంది కొవ్వూరు నుంచి వైయస్‌ జగన్‌కు ఘనంగా వీడ్కోలు పలకనున్నారు. రాజమండ్రి రోడ్డు కం రైల్వే బ్రిడ్జి నుంచి తూర్పుకు అడుగుపెట్టనున్న వైయస్‌ జగన్‌కు స్వాగతం పలికేందుకు మరో 50 వేల మందికిపైగా వేచి చూస్తున్నారు. చరిత్రలో ఇంత జనసంద్రాన్ని చూడలేదని, గోదావరి ఉప్పొంగిందా.. అనే రీతిలో ప్రజలు తరలివచ్చారన్నారు. 600ల వాగ్ధానాల్లో ఒక్కటి కూడా నెరవేర్చని చంద్రబాబుకు బుద్ధి చెబుతారన్నారు. పశ్చిమ నియోజకవర్గాల్లో 15 అసెంబ్లీ సీట్లు, 2 లోక్‌సభ స్థానాలను వైయస్‌ జగన్‌కు బంగారు పల్లెంలో పెట్టి ఇచ్చేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. 
Back to Top