చంద్ర‌బాబు చ‌ల‌వ‌తో ఎడారి కాబోతున్న గోదావ‌రి డెల్టా-క‌న్న‌బాబు

కాకినాడ: గోదావరి డెల్టాను ఎడారి చేసే ప్ర‌య‌త్నాల్ని వైయ‌స్సార్సీపీ వ్య‌తిరేకిస్తుంద‌ని పార్టీ తూర్పుగోదావ‌రి జిల్లా అధ్య‌క్షుడు కుర‌సాల క‌న్న‌బాబు స్ప‌ష్టం చేశారు. ఉభయ గోదావ‌రుల్ని ఎడారులు చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నారని  కన్నబాబు ధ్వజమెత్తారు. కాకినాడలో ఆయ‌న‌ మీడియాతో మాట్లాడారు. పట్టిసీమ మాదిరిగానే తూర్పుగోదావరి జిల్లా సీతానగరం వద్ద గోదావరి నదిపై మరో ప్రాజెక్టు నిర్మాణానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారని విమర్శించారు. బుధవారం  ఇప్పటికే పట్టిసీమ వల్ల గోదావరి డెల్టా అన్యాయమయ్యే పరిస్థితి వచ్చిందని వాపోయారు. ఇక గోదావరి నదిపై మరో ప్రాజెక్టు కడితే డెల్టా ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉందని ఆరోపించారు. 2018 కల్లా పోలవరం పూర్తి చేస్తామన్న టీడీపీ మళ్లీ ఈ కొత్త ప్రాజెక్టు ఎందుకు నిర్మిస్తున్నారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. గోదావరి డెల్టాను ఎడారిగా చేసే కార్యక్రమాన్ని వైఎస్‌ఆర్‌సీపీ వ్యతిరేకిస్తుందని కురసాల కన్నబాబు అన్నారు.
Back to Top