రైతుల గుండెల్లో దైవం

()
అండదండలు లేక
అల్లాడిపోయిన రైతన్నలు

()
ప్రజా
ప్రస్థానంలో రైతుల దుస్థితిని గమనించిన మహానేత

()
అధికారంలోకి
వచ్చాక రైతుల్ని ఆదుకొన్న వైనం

()
ఉచిత విద్యుత్, రుణమాఫీ వంటి విప్లవాత్మక నిర్ణయాలు

()
వ్యవసాయాన్ని
పండగగా మార్చిన వైయస్సార్‌ పాలన

 

 దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలు.
 ప్రత్యేకంగా మన రాష్ట్రం లో ఎక్కువగా గ్రామాలు. అందునా ఇది పూర్తిగా.
వ్యవసాయాధారిత రాష్ట్రం. ఈ రాష్ట్రం స్వయం సమృద్ధితో ఉండాలన్నా..గ్రామీణ ప్రాంత
ప్రజల ఆర్థిక విధానం పటిష్టంగా ఉండి తద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి
మెరుగుపడాలంటే..రైతులు సంతోషంగా ఉండటం ముఖ్యం. అలానే సామాన్యునికి ప్రధానంగా
కావాలసిన తినడానికి తిండి గింజలు, ఉండటానికి ఇల్లు,
కట్టుకోవడానికి
బట్టలు,
ఆరోగ్యానికి
వైద్యం,
పిల్లలకు విద్య, వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత వంటివి అవసరం.
 

 

చంద్రబాబు నిర్వాకం

2004లో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి
అధికారం చేపట్టే దాకా రైతుల్ని పట్టించుకొనే పరిస్థితి లేదు. అప్పటిదాకా వ్యవసాయం
దండగ అన్న సిద్దాంతాన్ని చంద్రబాబు పూర్తిగా ఆచరణలో పెట్టారు. అసలే కరువుతో
అల్లాడుతున్న రైతాంగం.. సాగునీరు అందే మార్గం లేక అల్లాడిపోయారు. అటు ఆదుకోవాల్సిన
ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని చూపింది. దీంతో అనేక చోట్ల రైతులు ఆత్మహత్యల బాట
పట్టారు. అయినప్పటికీ ఆత్మహత్యల్ని ప్రభుత్వ పెద్దలు హేళన చేయటంతో రైతన్నలు
నిరాశలో కూరుకొని పోయారు.

 

ప్రజా ప్రస్థానంలో పరిశీలన

అటువంటి సమయంలో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రతిపక్ష నాయకుని
హోదాలో రాష్త్రమంతా పర్యటించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లో మొదలైన ప్రజా
ప్రస్థానం మండుటెండల్లో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం దాకా సాగింది. కాలి నడకన
ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్లారు. ప్రతీ గ్రామంలోనూ రైతులు తమ గోడును
వెళ్లబోసుకొన్నారు. పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మొర
బెట్టుకొన్నారు. దీంతో రైతుల్ని ఆదుకొనేందుకు తీసుకోవలసిన చర్యల మీద వైయస్సార్‌ లో
అంతర్మథనం తీవ్రమైంది. అధికారంలోకి వస్తూనే మోటార్ల ద్వారా నీటిని తోడుకొనేందుకు వీలుగా
ఉచిత విద్యుత్‌ ను అందిస్తామని ప్రకటించారు. దీన్ని కూడా చంద్రబాబు హేళన చేశారు
తప్పితే రైతుల్ని ఆదుకొనేందుకు ప్రయత్నం చేయలేదు. 

 

మొదటి ప్రాధాన్యంగా వ్యవసాయం

అధికారం చేపట్టిన తర్వాత వైయస్సార్‌ వ్యవసాయ రంగం మీద మనస్సు లగ్నం చేశారు.
మొదటి సంతకంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ అందించే ఫైల్‌ మీద సంతకం చేశారు.
వెంటనే రాష్త్ర వ్యాప్తంగా ఇది అమల్లోకి వచ్చింది. వాస్తవానికి... రాష్ట్రంలో
సాగునీటి ప్రాజెక్టుల కింద సాగు అయ్యే భూమికంటే భూగర్భ జలాల నుంచి విద్యుత్‌
మోటార్ల ద్వారా సాగు ఎక్కువ. ఒక ఎకరం సాగు ద్వారా 50 నుంచి 60 మందికి ఉపాధి కల్పిస్తున్నారు.
ప్రభుత్వానికి రూ.4 నుంచి రూ.6 వేల వరకు ఆదాయం వస్తుంది. బోరు ఖర్చులు, మోటార్‌ ఖర్చు రైతులు భరించడమే కాక ఇవి
విఫలమైతే ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడం లేదు. ఇది సబ్సిడీ పథకం
కాదు.ప్రాజెక్టుల నుంచి వచ్చే నీటిని ఉచిత నీరు అనడం లేదు. రాష్ట్రంలో ఆహార
ధాన్యాల ఉత్పత్తికి గ్రామీణ ప్రాంతాల ఆర్థిక పటిష్టతకు వ్యవసాయానికి విద్యుత్‌
అవసరమని ఉచిత విద్యుత్‌ ఇవ్వడం జరిగింది. అంతే గాకుండా అప్పటిదాకా రైతుల దగ్గర
బకాయిలుగా ఉన్న  రూ.1269 కోట్ల వ్యవసాయ విద్యుత్‌ బకాయిలు రద్దు
చేశారు. తాను చనిపోయే వరకు 7 గంటల నిరంతర ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తానని మాట ఇచ్చి నెరవేర్చిన మహనీయుడు. 

మొత్తంగా 30 లక్షల పంపు సెట్లకు నిరాటంకంగా విద్యుత్‌ ను
సరఫరా చేయటం జరిగింది. 15 వందల కోట్ల యూనిట్ల విద్యుత్‌ ను వ్యవసాయ
రంగానికి అందించి లక్షల ఎకరాల్లో పంటను నిలబెట్టడం జరిగింది.

 

వ్యవసాయ రుణాల రద్దు

రైతాంగం తీవ్ర కష్టాల్లో కూరుకొని పోయి ఉన్నందున వ్యవసాయ దారుల్ని ఆదుకోవాలని
నిర్ణయించారు. వ్యవసాయ రుణాల్ని రద్దు చేయాలని వైయస్సార్‌ నిర్ణయించటంతో 64 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరింది.
దాదాపుగా 11వేల కోట్ల రూపాయిల మేర ఉపశమనం కలిగింది. అంతే
గాకుండా ముందస్తు వ్యవసాయ రుణాలు చెల్లించిన వారికి ప్రోత్సాహకంగా ఒక్కొక్క రైతుకు
రూ. 5వేల చొప్పున నగదు చెల్లించారు. దీంతో 36 లక్షల మందికి ప్రయోజనం దక్కింది. 18వందల కోట్ల రూపాయిల్ని రైతులకు పంపిణీ
చేయించారు. 

 

ఆర్థికంగా భరోసా

గ్రామాల్లో రైతులకు పెట్టుబడి డబ్బులు దొరకటం అంత తేలిక కాదు. సీజన్‌
మారినప్పుడల్లా పెట్టుబడి కోసం రైతులు అల్లాడిపోతుంటారు. దీంతో వ్యవసాయ దారులకు
క్రాప్‌ లోన్లు ఇవ్వటంలో నిబంధనల్ని సరళతరం చేయాలని వైయస్సార్‌ నిర్ణయించారు. అంతే
గాకుండా పావలా వడ్డీకే రుణాలు ఇవ్వాలని సంకల్పించారు. రైతులకు ఏకంగా రూ. 22, 650 కోట్ల మేర రుణాలు అందించారంటే ఆ ఘనత
వైయస్సార్‌ కే దక్కుతుంది. రుణాల్ని తిరిగి చెల్లించేవారకి ప్రోత్సాహకాలు కూడా
అందించటంతో గ్రామీణ వ్యవస్థ కళ కళలాడింది.

 

అనుబంధ రంగాలకు ప్రోత్సాహం

వ్యవసాయ అనుబంధ రంగాల్ని అమితంగా ప్రోత్సహించిన ఘనత దివంగత మహానేత వైయస్సార్‌
ది. పశువుల కొనుగోలు కోసం పశుక్రాంతి పథకం ప్రవేశ పెట్టారు. పావలా వడ్డీకే రుణాలు
అందించే ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా 30వేల రూపాయిల సబ్సిడీని ప్రకటించారు. దీంతో
విరివిగా పశువుల కొనుగోళ్లకు అవకాశం ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాల్లో పాల వెల్లువను
ఏర్పాటు చేయగలిగారు. అటు దేశంలోనే మొదటిసారిగా గొ్రరెల బీమా పథకాన్ని ప్రకటించి
అమలు చేశారు. 

 

        మాట తప్పని, మడమ తిప్పని యోధుడు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌
రాజశేఖరరెడ్డి. రాష్ట్ర సమాగ్రాభివృద్ధే ధ్యేయంగా అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేసి
పేద,
బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి, సంక్షేమం దిశగా దేశంలో ఏ ముఖ్యమంత్రి పాలన
చేయని రీతిలో ఒక్క రూపాయి కొత్త పన్ను విధించకుండా, ఒక్క రూపాయి పన్ను పెంచకుండా పాలన గావించారు.
అభివృద్ధితో ఏర్పాటువాదాన్ని నిరోధించి రాష్ట్రలో మారు మూల ప్రాంత వ్యవసాయ
కార్మికుని నుంచి మేథావులు సైతం దేశ ప్రధాని వరకు ఈ రోజు వైయస్‌ రాజశేఖరరెడ్డి
బతికి ఉండి ఉంటే రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చే ఉండేది కానది
అభిప్రాయపడుతున్నారు.  

 

Back to Top