ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందించడమే ధ్యేయం

గుంతకల్లు: రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలను అందించాలన్న లక్ష్యంతోనే వైయ‌స్ఆర్‌ సీపీ అధినేత వైయ‌స్‌.జగన్‌మోహన్‌ రెడ్డి నవరత్నాల్లాంటి పథకాలను ప్రకటించారని  పార్టీ నియోజకవర్గం సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి తెలిపారు. సోమవారం పట్టణంలోని 14, 4, 28, 33 వార్డుల్లో జరిగిన వైయ‌స్ఆర్‌ కుటుంబం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 14వ వార్డులో వార్డు ఇన్‌చార్జ్‌ రాజశేఖర్, 4వ వార్డు ఇన్‌ఛార్జ్‌ శేఖర్, 28వ వార్డు కౌన్సిలర్‌ మాల రంగన్న, 33వ వార్డు ఇన్‌ఛార్జ్, మాజీ కౌన్సిలర్‌ విద్యారాణిలతో కలిసి ఆయా వార్డుల్లో ఇంటింటికీ తిరుగుతూ నవరత్నాల గురించి ఆయన ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ప్రజలు వెంకటరామిరెడ్డి ఎదుట తమ సమస్యలను ఏకరువు పెట్టారు. డ్వాక్రా రుణాలు మాఫీ కాక, వడ్డీలు చెల్లించలేక అప్పుల్లో కూరుకుపోయామని, శుద్ధమైన నీటిని మున్సిపాలిటీ సరఫరా చేయడం లేదని వారు ఆరోపించారు. వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే వైయ‌స్‌.జగన్‌ను సీఎం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైయ‌స్ఆర్ ప్రజా పరిపాలన తిరిగి రావాలంటే వైయ‌స్ఆర్‌సీపీని ఆదరించాలని ఆయన కోరారు. 9912199121కి ఫోన్‌ చేసి ప్రజలే స్వచ్ఛందంగా వైయ‌స్ఆర్‌ కుటుంబంలోకి చేరారు. పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్‌.రామలింగప్ప, ఎస్సీసెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకల రామాంజినేయులు, పార్టీ పట్టణ అధ్యక్షుడు బి.సుంకప్ప, జిల్లా సహాయ కార్యదర్శి వై.సుధాకర్, యువజన విభాగం రాష్ట్ర నేత వైఎస్‌.బసిరెడ్డి, సీనియర్‌ నేతలు దశరథరెడ్డి, శంకర్, సాంస్కృతిక విభాగం కార్యదర్శి త్యాగరాజు, మైనార్టీ విభాగం రాష్ట్ర సహాయ కార్యదర్శి మైనుద్దీన్, తదితరులు పాల్గొన్నారు. పై నాలుగు వార్డులతో పాటు 35వ వార్డు కౌన్సిలర్‌ అహమ్మద్‌ బాషా, 34వ వార్డు ఇన్‌ఛార్జ్‌ సుమోబాషా, 19వ వార్డులో కౌన్సిలర్‌ బీ.టీ.లక్ష్మిదేవి, 10వ వార్డు ఇన్‌ఛార్జ్‌ మార్కెట్‌ వెంకటేష్, 15వ వార్డు కౌన్సిలర్‌ టి.గోపిల ఆధ్వర్యంలో వైఎస్సార్‌ కుటుంబం కార్యక్రమాల్ని నిర్వహించారు. కార్యక్రమాల్లో ఆయా వార్డుల్లోని ముఖ్య నేతలు, బూత్‌ కమిటీ కన్వీనర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

తాడిపత్రిలో వైయ‌స్ఆర్ కుటుంబం 
తాడిపత్రి:  పట్టణంలోని భగత్‌సింగ్‌నగర్, సుంకులమ్మపాలెంలో సోమవారం వైయ‌స్ఆర్ కుటుంబం కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ఇంటింటికి వెళ్లి దివంగత నేత పాలనలో ప్రవేశ పెట్టిన పథకాలను వివరించారు. వైయ‌స్ జగన్‌ ముఖ్యమంత్రి కాగానే ప్ర‌వేశ‌పెట్ట‌బోయే న‌వ‌ర‌త్నాలు ప‌థ‌కాల‌ను వివ‌రించారు. కార్యక్రమంల్లో నాయకులు బాబా, రంగనాథరెడ్డి, నాగిరెడ్డి, నాగేశ్వరరెడ్డి,రాజా , రవి, తదతరులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top