జీఓ.. 271ని రద్దు చేయాలి

కర్నూలు:

భూమిపై రైతులకు యాజమాన్య హక్కులు హరించే జీఓ నెంబర్‌ 271ని వెంటనే రద్దు చేయాలని వైయస్‌ఆర్‌సీపీ జిల్లా కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి, తుగ్గలి మండల కన్వీనర్‌ జిట్టా నాగేష్‌ డిమాండ్‌ చేశారు. పట్టాదారు ఈ–పాస్‌బుక్‌ విధానానికి వ్యతిరేకంగా  స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట వైయస్‌ఆర్‌సీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. అనంతరం తహశీల్దార్‌ టి.దాస్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... 1971లో ఆర్‌ఓఆర్‌ చట్టాన్ని సవరణ చేసి భూమి హక్కులు నిర్ధారిస్తూ  భూమి యాజమాన్య హక్కు పత్రాలు(టైటిల్‌ డీడ్‌), పాసు పుస్తకాలను రైతులకు అందజేశారని గుర్తు చేశారు. దీని వల్ల రైతులకు భద్రతతో పాటు, భరోసా కలిగిందన్నారు.   జీఓ నెంబర్‌ 271 ప్రకారం కంప్యూటర్‌ లో భూమి ఎవరి పేరుమీద నమోదైతే వారికే చెందుతుందని, దానికి ఏ ఆధారం అవసరం లేదని అనడం సరైంది కాదన్నారు.

Back to Top