శిల్పా మోహన్‌రెడ్డికి భారీ మెజార్టీ ఇవ్వండి

నంద్యాల విద్య: నంద్యాల 34వ వార్డులో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్‌ ముస్తఫా, నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలు  వైయస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే కాక మునుపే నంద్యాల నియోజకవర్గ ప్రజల పేదరిక నిర్మూలనకు శిల్పామోహన్‌రెడ్డి శిల్పా సేవా సమితిని స్థాపించారని గుర్తు చేశారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఉచిత మినరల్‌ వాటర్, నిరుద్యోగులు జాబ్‌మేళాలు, రేషన్‌ కార్డు దారులందరికీ 12శాతం తక్కువకు ఎమ్మార్పీపై నిత్యావసర వస్తువులు అందించిన ఘనత శిల్పామోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా నంద్యాల నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడ్డ సౌమ్యుడు అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి శిల్పామోహన్‌రెడ్డి అన్నారు. జగన్‌ను 2019లో ముఖ్యమంత్రి చేసుకునేందుకు నంద్యాల ఓటర్లు నాందిగా శిల్పామోహన్‌రెడ్డికి భారీ మెజార్టీ అందించి గెలిపించాలని ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో 34వ వార్డు కౌన్సిలర్‌ జాకీర్‌హుసేన్, గౌస్, అలిసా, శివ, హుసేన్‌సా, దస్తగిరి, వలి, తదితరులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top