బాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలి

మలికిపురం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విధంగా  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పూజలు నిర్వహించారు.  ఈ సందర్భంగా పార్టీ నాయకుడు అడబాల మూలాస్వామి నాయుడు మాట్లాడుతూ..చంద్రబాబు కమీషన్ల కోసం కక్కుర్తి పడి  ప్యాకేజీలకు  అమ్ముడు పోయి  హోదాను తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం  చేశారు.  హక్కుల కోసం ఉద్యమిస్తున్న ప్రజలపై ఉక్కుపాదం మోపుతున్న ఇటువంటి సర్కారును ఏనాడూ  చూడ లేదని ఆగ్రహం వ్యక్తం  చేశారు. కార్యక్రమంలో  పార్టీ నాయకులు నల్లా సుందరం, శృంగారపు ఏసుబాబు, యెనుముల వీర వెంకటయ్య, య్రరంశెట్టి సుబ్బరాజు, పి, రాజేష్,  యు. సురేష్, ఎం.నరేష్,  ఎస్‌. రంగా, ఎం. రమేష్, ఎ.జగదీష్, రాముడు, భాస్కరరావు, నల్లి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top