రైతు, డ్వాక్రా రుణాల మాఫీ కంటే ముఖ్యమైన అంశం ఏమైనా ఉందా?

హైదరాబాద్: ‘రైతు, డ్వాక్రా రుణాల మాఫీ కంటే ముఖ్యమైన అంశం ఏమైనా ఉందా? రైతులు, డ్వాక్రా అక్కచెల్లెమ్మలు అవస్థలు పడుతుంటే.. రుణమాఫీ మీద చర్చించకుంటే ఎలా? ఈ నెల 10న 344 నిబంధన కింద రైతు, డ్వాక్రా రుణాల మాఫీ అంశంపై చర్చకు నోటీసిచ్చాం. ఈ అంశం మీద చర్చ జరగాలని బీఏసీ సమావేశంలో చెప్పాం. అదేమిటని అడిగితే.. మేం(విపక్షం) సభలో లేనప్పుడు చర్చించామంటారు. మేం సభలో లేనప్పుడు.. అన్నీ అబద్ధాలతో సీఎం ప్రకటన చేసి, మీకు మీరే(అధికార పక్షమే) మాట్లాడుకుంటే సరిపోతుందా? విపక్షం లేకుండా మీరే మాట్లాడుకుని చర్చ అయిపోయిందనడం సరైన పద్ధతేనా?’ అని విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో గురువారం ప్రశ్నించారు.
Back to Top