చర్చలో అవకాశం కల్పించండి

  • ఏపీకి ప్రత్యేకహోదా కీలకమైన అంశం
  • రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేట్‌ బిల్లుపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ తరఫున చర్చలో మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి డిప్యూటీ చైర్మన్‌ కురియన్‌ను కోరారు. రాజ్యసభలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..ఆంధ్ర రాష్ట్ర విభజనకు కాంగ్రెస్‌ బాధ్యత వహించాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అనేది చాలా కీలకమైన అంశం అని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కోరుతూ ప్రవేశపెట్టిన ప్రైవేట్‌ బిల్లుపై చర్చలో తమ పార్టీ ప్రాతినిధ్యం లేకుండా పోయిందని, తాను వైయస్‌ఆర్‌సీపీ తరఫున రాజ్యసభకు ఎంపికైన మొట్టమొదటి వ్యక్తిని కాబట్టి, సభలో మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని కోరారు.
Back to Top