గిరిజ‌నుల ద్రోహి బాబు

* నాడు గిరిజ‌నుల అభివృద్ధికి కృషి  చేసిన వైయ‌స్‌
* నేడు వాళ్ల‌ను మోసం చేస్తున్న బాబు
* ఈ నెల 8న ప్ర‌పంచ గిరిజ‌న దినోత్స‌వ స‌భ‌
* వైయ‌స్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్య‌క్షుడు మేరుగు నాగార్జున‌
విజ‌య‌వాడ (మంగ‌ళ‌గిరి):  రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ద‌ళితులు, గిరిజ‌నుల ప‌ట్ల చాలా దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్య‌క్షుడు మేరుగు నాగార్జున అన్నారు. దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి నాడు గిరిజ‌నుల అభివృద్ధికి కృషి చేస్తే నేడు చంద్ర‌బాబు గిరిజ‌నుల‌ను ప‌ట్టించుకోవ‌డ‌మే మానేశాడ‌ని దుయ్య‌బ‌ట్టారు. శుక్ర‌వారం ఆరండ‌ల్‌పేట‌లోని జిల్లా పార్టీ కార్యాల‌యంలో విలేక‌రుల‌తో మాట్లాడుతూ  ఐక్యరాజ్య సమితిలోని దేశాలన్ని గిరిజనుల అభివృద్ది, వారి స్థితిగతులను మెరుగుపరచడం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంటే భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అందుకు భిన్నంగా గిరిజనులను తెలుగుదేశం ప్రభుత్వం విస్మరిస్తోంద‌న్నారు. ఆగస్టు 8వ తేదిన ప్రపంచ గిరిజన దినోత్సవ సభను పురస్కరించుకుని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిరిజన విభాగం అధ్యర్యంలో రాష్ట్ర గిరిజన విభాగం ప్రధాన కార్యదర్శి మేరాజోత్‌ హనుమంత్‌ నాయక్‌ నేతృత్వంలో గుంటూరులోని కేకేఆర్ ఫంక్షన్‌ ప్లాజాలో నిర్వహించనున్నట్లు తెలిపారు. గిరిజ‌నుల అభివృద్ధి కోసం దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి  కొన్ని లక్షల భూములను పంచిపెట్టిన  ఘనత వైయ‌స్ఆర్‌ది అన్నారు.  రాజ్యాంగ ప్రతిపాదికన ప్రతి జిల్లాలో గిరిజనుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. కాని తెలుగుదేశం ప్రభుత్వం గిరిజనులకు విరుద్దంగా నడుస్తుందని మండిపడ్డారు. గిరిజనులు ఆనారోగ్యాల బారి చనిపోతుంటే వైద్యశాఖ మంత్రి నీరు తాగడం వలన చనిపోయారని చెప్పడం సిగ్గు చేటన్నారు. గిరిజనుల ఆరోగ్య పరిస్థితులు మెరుగపడక తండాల్లో వైద్య సేవలు లభించక పట్టణాలు వచ్చి అక్కడ వారికి వైద్య సేవలు సక్రమంగా అందక పలు రకాల ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని మండిపడ్డారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు అవగహన లేకుండా మాట్లాడటం సిగ్గు చేటన్నారు. గిరిజనుల అభివృది కోసం ఎలాంటి చర్యలు చేపట్టారో చెప్పాలన్నారు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే గిరిజనుల‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌లాగానే  మరిన్ని అభివృద్ది కార్యక్రమాలు చేపడతారని అన్నారు. 
Back to Top