రావెల బాధితురాలికి ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రి ప‌రామ‌ర్శ‌

హైద‌రాబాద్‌) ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు కుమారుడు సుశీల్ కీచ‌క ప‌నుల బాధితురాలికి వైఎస్సార్సీపీ అండ‌గా నిలిచింది. పార్టీ మ‌హిళా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రి సాయంత్రం బాధితురాలి ఇంటికి వెళ్లారు. అక్క‌డ ఆమె ను ప‌రామ‌ర్శించి ధైర్యం చెప్పారు. హైద‌రాబాద్ బంజారాహిల్స్ లో రో్డ్ పై వెళుతున్న మ‌హిళా టీచ‌ర్ ను మంత్రి రావెల కిశోర్ బాబు కుమారుడు సుశీల్ బాబు లైంగికంగా వేధించిన ఘ‌ట‌న తెలిసిందే. దీనిపై క‌థ‌లు వినిపించేందుకు సుశీ్ల్ ప్ర‌య‌త్నించాడు. అయితే ఆమెను వేధించిన విష‌యం సీసీ టీవీ ఫుటేజీల్లో స్ప‌ష్టంగా వెలుగు చూసింది. అయిన‌ప్ప‌టికీ అత‌నిపై చ‌ర్య‌లు తీసుకొనేందుకు పోలీసులు వెనుకాడుతున్నారు.  మంత్రి కుమారుడు నేరం చేశాడ‌ని తెలిసినా అరెస్టు చేయ‌టానికి పోలీసులు ఆలోచిస్తున్నార‌ని ఆమె మండిప‌డ్డారు. మ‌హిళ‌ల‌కు ఎవ‌రికైనా ఒక‌టే న్యాయం అమ‌లు కావాల‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రావెల సుశీల్ బాబు అరెస్టు చేయ‌క‌పోతే అసెంబ్లీలో ఈ విష‌యాన్ని లేవ‌నెత్తుతామ‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. 
Back to Top