చంద్రబాబు ఇదేనా ప్రజాస్వామ్యం

చంద్రబాబు నియంత పాలన
సెక్స్ రాకెట్ కేసును పక్కదారి పట్టించారు
అందుకోసం అంబేద్కర్ పేరు వాడుకున్నారు
ప్రజాసమస్యలు చర్చకు రాకుండా అడ్డుకున్నారు
ఆంధ్రజ్యోతిని అడ్డుపెట్టుకొని కేసులు పెట్టారు

హైదరాబాద్ః
చంద్రబాబు నియంత పాలన సాగిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి
ఈశ్వరి మండిపడ్డారు. ప్రజల సమస్యలు వారి మనోభావాలను తెలియజేప్పేందుకు తాము
సభలో చర్చకు పట్టుబడితే... ప్రభుత్వం దాన్ని అడ్డుకోవడం దారుణమన్నారు.
ప్రజలు ఓట్లు వేసి సభకు పంపించింది ఇందుకేనా అని ప్రభుత్వాన్ని ఈశ్వరి
ప్రశ్నించారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి.  కాల్ మనీ సెక్స్ రాకెట్,
కల్తీమద్యం, బాక్సైట్ సహా అనేక అంశాలపై  చర్చ జరిపి  ప్రజలకు రక్షణ, భద్రత
కల్పించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదా అని నిలదీశారు. 

అసెంబ్లీ
సమావేశాలను కంటితుడుపుగా ఐదు రోజులు నిర్వహించడమే గాకుండా..ఉన్న సమయంలో
కూడా ప్రజల సమస్యలపై చర్చ జరగకుండా ఆటంకాలు సృష్టిస్తున్నారని ప్రభుత్వంపై
ఈశ్వరి నిప్పులు చెరిగారు.  అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అన్న బాధ
కలుగుతోందన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాల్ మనీ సెక్స్ రాకెట్
లో ఇరుక్కున్నారనే చంద్రబాబు సభను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. అందుకు
తమ ఆరాధ్యదైవం అంబేద్కర్ పేరు వాడుకోవడం దుర్మార్గమన్నారు.

అంబేద్కర్
పేరును గొప్ప కార్యక్రమానికి వాడుకుంటే హర్షించేవాళ్లం . కానీ, చంద్రబాబు
భజన చేసేందుకు పచ్చనేతలు అంబేద్కర్ పేరు ఉపయోగించుకుంటున్నారని ఈశ్వరి
మండిపడ్డారు.  అంబేద్కర్  దళిత గిరిజనుల హక్కు. రాజకీయ అవసరాల కోసం అలాంటి
మహనీయుని పేరు వాడుకోవడం సిగ్గుచేటన్నారు. సెక్స్ రాకెట్ పై చర్చ పెట్టాలని
డిమాండ్ చేస్తే ..సమస్యల మీద స్పందించే తీరును తప్పుదోవ పట్టించి
వినడానికి కూడా ఓపిక లేని పరిస్థితుల్లో సబ్జెక్ట్ లో వెళ్లకుండా
అడ్డుకున్నారని పచ్చసర్కార్ పై ఫైరయ్యారు. సభలో దళిత మహిళల చేత చంద్రబాబు
నాటకాలు ఆడించడం మానుకోవాలన్నారు.  మహిళల గొంతు నొక్కేలా రోజాపై సస్పెన్షన్
వేయడం దుర్మార్గమన్నారు. సెక్స్ రాకెట్ లో మహిళలకు అన్యాయం జరుగినందున
వాళ్ల గురించి కన్నీరు పెడదామని అనిత, పీతల సుజాతలకు ఈశ్వరి సూచించారు.   

బాక్సైట్
ను అడ్డుకోవాలంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యమాలు చేసిన చంద్రబాబు
అధికారంలోకి వచ్చాక మాట మార్చారన్నారు.  ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజునే
తవ్వకాలకు సిద్ధమని ప్రకటించారు. రాజకీయాలకు, ప్రాంతాలకు, వ్యక్తులకు
అతీతంగా మా అడవిని, ప్రకృతిని,  పర్యావరణాన్ని కాపాడుకోవడానికి
ఉద్యమిస్తున్నామన్నారు.  చంద్రబాబు..మాట్లాడే మాటలకు, విధానాలకు పొంతనే
లేదని ఈశ్వరి విమర్శించారు. గిరిజనుల సంపదను దోచుకోవాలని చూస్తే ఊరుకోబోమని
హెచ్చరించారు.

కేంద్రం నుంచి వచ్చిన జీవో తమకు
తెలియదని చంద్రబాబు, మంత్రులు మాట్లాడుతున్నారు. మరి అలాంటప్పుడు జీవో
ఎందుకు రద్దు చేయడం లేదని ఈశ్వరి వారిని సూటిగా ప్రశ్నించారు. జీవో  97లో
3000 ఎకరాలు ఏపీఎండీసీకి అప్పగించామని చెబుతున్నారు. ఏవిధంగా ఇస్తారన్నారు.
 గిరిజనుల హక్కులపై వారికే పరిరక్షణ ఉంటుందని రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్
చెబుతుందన్నారు.  ఇక మంత్రి పీతల సుజాత తనను పిలిచి బాక్సైట్ అంటే ఏంటని
అడిగారు. మైనింగ్ మంత్రి అయి ఉండి అలా అడుగుతున్నారంటే పాలన ఏవిధంగా ఉందో
అర్థమవుతోందని ఈశ్వరి ఎద్దేవా చేశారు.  ఆంధ్రజ్యోతిలో రాసిన వాటిని అడ్డం
పెట్టుకొని టీడీపీ నేతల అండతో దేశద్రోహి, జీవితఖైదు, హత్యాయత్నం అంటూ తనపై
కేసులు పెట్టారని ఈశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు.
Back to Top