రావెల రాజీనామా చేయాలి

దొరికిపోయిన కీచకుడు
రావెల సుశీల్

అతడ్ని అరెస్టు
చేయాల్సిందే

హైద‌రాబాద్‌: గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంలో అస‌త్యాల‌నే
టీడీపీ ప్ర‌భుత్వం పుస్త‌క‌రూపంలో పొందుప‌రిచింద‌ని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే
గిడ్డి ఈశ్వ‌రి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద ఆమె మ‌హిళా ఎమ్మెల్యేలు
విశ్వాస‌రాయి క‌ళావ‌తి, పుష్ప‌శ్రీ‌వాణి ల‌తో క‌లిసి మాట్లారు. గిరిజ‌న ప్రాంతం
కోసం గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంలో మాట్లాడిన‌వ‌న్నీ అస‌త్యాలేన‌ని ఆరోపించారు.

అన్నీ అబద్దాలే

ఉత్త‌రాంధ్రలో త్రాగునీటి కోసం ప్ర‌జ‌లు
అల్లాడుతుంటే త్రాగునీటి కోసం ఎలాంటి ప‌థ‌కాలు పెట్ట‌కుండా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం
ప్ర‌భుత్వ గొప్ప‌లు చెప్పుకొచ్చింద‌ని మండిప‌డ్డారు. విశాఖప‌ట్నం స్వ‌చ్ఛ‌భార‌త్‌లో ఐద‌వ స్థానం వ‌చ్చింద‌ని
చెప్పుకుంటున్నార‌ని, ఉత్త‌రాంధ్ర‌లో అన్ని ప్రాంతాలు వెనుక‌బ‌డి ఉన్నాయని వాటి
గురించి మాత్రం ప్ర‌స్తావించ‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గిరిజ‌నుడికి
గిరిజ‌న శాఖ మంత్రి ప‌ద‌వి ఇస్తే గిరిజ‌నుల బాధ‌లు తెలుస్తాయ‌న్నారు. ఇచ్చిన
శాఖ‌కు న్యాయం చేయ‌కుండా ప‌ద‌విని అడ్డం పెట్టుకొని 55 ఎక‌రాల
అసైన్డ్ భూమిని సంపాదించార‌న్నారు. రాజ‌ధాని ప్రాంతంలో అక్ర‌మంగా రైతుల వ‌ద్ద నుంచి
చిన‌బాబు, పెద‌బాబు
భూములు లాక్కొని రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నార‌న్నారు. రాజ‌ధాని ప్రాంతంలో
గిరిజ‌న అసైన్డ్ భూముల‌ను ఎందుకు కొన్నార‌ని చంద్ర‌బాబును ప్ర‌శ్నించారు. అవినీతి నామస్మరణ

చంద్ర‌బాబు
ప్ర‌భుత్వం చేప‌డుతున్న అక్ర‌మ అవినీతి కార్య‌క్ర‌మాల‌ను, ప్ర‌జ‌ల‌కు
ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌క‌పోవ‌డాన్ని బ‌డ్జెట్ స‌మావేశాల్లో వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీ నిల‌దీస్తుంద‌ని హెచ్చరించారు. కోట్లాది రూపాయ‌ల‌ను ఎర‌గా చూపి
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల‌ను కొంటున్నార‌ని మండిప‌డ్డారు. వైఎస్సార్ సీపీ
గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు సిగ్గుంటే రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేవారు. ప్ర‌తిప‌క్ష
పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో నిధులు ఇవ్వ‌కుండా నూత‌న క‌మిటీల‌ను
ఏర్పాటు చేసి వారికి నిధులు కేటాయిస్తున్నార‌ని ఆరోపించారు. 

రావెల బాగోతం

మంత్రిరావెల
కిషోర్ కీచ‌క త‌న‌యుడు సుశీల్ త‌ప్ప‌తాగి రోడ్డుపై న‌డుచుకుంటూ వెళ్తున్న
ఫాతిమాబేగం అనే టీచ‌ర్‌ను న‌డిరోడ్డుపై ఇబ్బందిపెడితే మంత్రి కొడుక‌ని ఎలాంటి
శిక్ష వేయ‌క‌పోవ‌డం బాధ‌క‌ర‌మ‌న్నారు. త‌ప్పు చేసిన వారు ఎంత‌టివారైనా చ‌ట్ట‌రీత్యా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. మార్చి 8వ తేదీన ప్ర‌పంచ మ‌హిళా
దినోత్స‌వాన్ని గొప్ప‌గా జ‌రుపుకుంటున్నామ‌ని ప్ర‌భుత్వం చెప్పుకోవ‌డం కాద‌ని, మ‌హిళ‌ల‌పై జ‌రిగే
అన్యాయాల‌ను అరిక‌ట్టాల‌ని సూచించారు. మంత్రి త‌న‌యుడు చేసిన నీచ చేష్ట‌ల‌ను
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంద‌ని తెలిపారు. గిరిజ‌న శాఖ‌మంత్రిగా
ఉంటూ గిరిజ‌న ద్రోహిగా భూదందాల‌ను చేస్తున్న మంత్రి రావెల త‌క్ష‌ణ‌మే రాజీనామా
చేయాల‌ని ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రి డిమాండ్ చేశారు.

 

Back to Top