మహిళల స్థితిగతులు పట్టవా..!

హైదరాబాద్) స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానమే అని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు .. సత్యదూరంగా ప్రవర్తిస్తున్నారని ప్రతిపక్ష వైెఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అభిప్రాయ పడ్డారు. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే అని ఆమె స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాన్ని అర్థంతరంగా ముగించిన తర్వాత మీడియా పాయింట్ దగ్గర ఆమె మాట్లాడారు. రిషితేశ్వరి ఆత్మహత్య, మహిళా తహశీల్దార్ వనజాక్షి మీద దాడి వంటి విషయాల్ని ఎందుకు దాచిపెడుతున్నారని ఆమె ప్రశ్నించారు. మంత్రి రావెల కిషోర్ బాబు కుమారుడు పట్ట పగలు మహిళల్ని వేధించినా కానీ వెనకేసుకొని వస్తున్నారని ఆమె అన్నారు. కొడుకును పెంచటం చేత కాక, కిషోర్ బాబు నిస్సిగ్గుగా సమర్థించుకొంటున్నారని ఆమె వ్యాఖ్యానించారు. అంతెందుకు కాల్ మనీ సెక్సు రాకెట్ కుంభకోణాన్ని నడిపించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉన్నప్పటికీ ఎటువంటి చర్యలు లేవని గిడ్డి ఈశ్వరి అన్నారు. 
Back to Top