ఈనెల 11నుంచే ఎన్నికలకు సమాయత్తం

()ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనపై రాజీలేని పోరాటం
()మున్సిపల్ పోరుకు వైయస్సార్సీపీ సమాయత్తం
()ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమీక్ష
()పార్టీ కార్యాలయంలో నేతలకు వైయస్ జగన్ దిశానిర్దేశం
()ఎన్నికలు జరగనున్న చోట్ల ఇంఛార్జ్ ల నియామకం

హైదరాబాద్ః ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న టీడీపీ సర్కార్ పై వైయస్సార్సీపీ ప్రజల పక్షాన రాజీలేని పోరాటం కొనసాగిస్తుందని వైయస్సార్సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కన్నబాబు తెలిపారు. పార్టీ కార్యాలయంలో సమీక్షా సమావేశం అనంతరం కన్నబాబు మీడియాతో మాట్లాడారు. రాబోవు మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల కోసం  సమాయత్తం కావాలని అధ్యక్షులు వైయస్ జగన్ పార్టీశ్రేణులకు దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు.

రాష్ట్రంలో దాదాపు 9 జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నట్లు కన్నబాబు చెప్పారు. వైయస్సార్సీపీ తరపున అక్కడ పని చేసేందుకు అధ్యక్షులు వైయస్ జగన్ ఇంఛార్జ్ ల నియామకం చేపట్టారని, పార్టీ కేడర్ అంతా టీమ్ వర్క్ గా పనిచేయాలని సూచించారని కన్నబాబు తెలిపారు. ఈనెల 11నుంచే మున్సిపల్ ఎన్నికలకు సర్వం సన్నద్ధమవుతున్నట్లు స్పష్టం చేశారు. అదేవిధంగా గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం యథావిథంగా కొనసాగుతుందన్నారు.  ప్రతీ ఒక్కరూ బాబు పాలనపై తీవ్ర అసహనంతో ఉన్నారని, బాబు మోసపూరిత పాలనను ప్రజలే తమకు వివరిస్తున్నారని కన్నబాబు పేర్కొన్నారు. 

ఇంఛార్జ్ లుగా..
శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్- చంద్రశేఖర్, బూడి ముత్యాలనాయుడు, ధర్మాన ప్రసాదరావు, రెడ్డి శాంతి, కొయ్య మోషన్
విశాఖపట్నం గ్రేటర్ మున్సిపాలిటీకి-విజయసాయిరెడ్డి, మేరుగ నాగార్జున, దాడిశెట్టి రాజా, గుడివాడ అమర్నాథ్, వెంకటరమణ 
కాకినాడ కార్పొరేషన్-చలమలశెట్టి సునీల్, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, బొత్స సత్యనారాయణ, చీర్ల జగ్గిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్
గుంటూరు కార్పొరేషన్- మిథున్ రెడ్డి, కొలుసు పార్థసారథి,  లేళ్ల అప్పిరెడ్డి, షేక్ మహ్మద్, మర్రి రాజశేఖర్
ఒంగోలు కార్పొరేషన్-కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, డీసీ.గోవిందరెడ్డి, సామినేని ఉదయభాను, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, మాధవరావు
కందుకూరు మున్సిపాలిటీ-కాకాని గోవర్థన్ రెడ్డి, జంకె వెంకట్ రెడ్డి
రాజంపేట మున్సిపాలిటీ-ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, వైయస్ అవినాష్ రెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి, మేయర్ సురేష్ బాబు వీరితో పాటు జిల్లా అధ్యక్షులు, స్థానిక కోఆర్డినేటర్లు
కర్నూలు కార్పొరేషన్-రవీంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాష, విశ్వేశ్వరరెడ్డి, గౌరు చరితారెడ్డి, హఫీజ్ ఖాన్, మురళీకృష్ణ, గౌరు వెంకట్ రెడ్డి, అనంతవెంకట్రాంరెడ్డి
తిరుపతి కార్పొరేషన్ -పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి వీరితో పాటు నారాయణస్వామి, 
రాజాం మున్సిపాలిటీకి- బొత్స అప్పలనర్సయ్య, పాలవలస రాజశేఖర్, కంబాల జోగులు
నెల్లిమర్ల మున్సిపాలిటీకి- ధర్మాన క్రిష్ణదాస్, కొలగట్ల వీరభద్రస్వామి, పి. సురేష్

ప్రభుత్వ తాత్సారం వల్లే
సేవాదృక్పథం, స్థానికంగా పలుకుబడి కలిగిన అభ్యర్థులను ఎంపిక చేయాలని వైయస్ జగన్ సూచించారని కన్నబాబు తెలిపారు. విధేయతకు కూడా ప్రాధాన్యం ఇవ్వమని నిర్థేశించారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఓటర్స్ వెరిఫికేషన్ పేరిట వేలాదిమంది ఓటర్లను తొలగించిందని కన్నబాబు ఆరోపించారు. కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల తొలగింపుపై ప్రత్యేకదృష్టి పెట్టనున్నట్లు చెప్పారు.  వాస్తవానికి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడో జరగాల్సి ఉండగా ప్రభుత్వం తాత్సారం చేసిందని దుయ్యబట్టారు. నవంబర్ లోపు ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించినందున తప్పకుండా ఎన్నికలు జరుగుతుయన్నా భావనతో పార్టీ ఉందన్నారు. ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసి మంచి అభ్యర్థులను గెలిపించి.... మున్సిపాలిటీల్లో మెరుగైన పరిపాలన అందించేవిధంగా వైయస్సార్సీపీ కృషి చేస్తుందని చెప్పారు. 

అధికారపార్టీ అరాచక పాలన
తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులతో రాజ్యాన్ని ఏలాలనే అరాచక ధోరణిలో అధికారప్రభుత్వం ఉందని కన్నబాబు మండిపడ్డారు. తునిలో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కొని ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కన్నబాబు ఫైర్ అయ్యారు. రైతుల ఆందోళనలు పట్టింంచుకోకుండా ప్రభుత్వం దివీస్ మీద ప్రేమ కురిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు అండగా వైయస్సార్సీపీ ఉందని స్పష్టం చేశారు. అఖిలపక్ష సమావేశముందని తెలిసి వందలాది మంది పోలీసులను మోహరించి వైయస్సార్సీపీ నేతలను హౌజ్ అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. గతంలో కాపు సమావేశం సమయంలోనూ పోలీసులతో అణిచివేసే విధానంతో ప్రభుత్వం భయాందోళన సృష్టించిందని విమర్శించారు. తుని ఘటనపై సమగ్ర విచారణ జరిపించకుండా అధికార పార్టీ వైయస్సార్సీపీపై  కుట్రలు చేస్తోందని కన్నబాబు ఆగ్రహించారు. 
Back to Top