వైయస్ఆర్ కుటుంబంతో మమేకం కండి

సత్తెనపల్లి: ప్రజల సహకారంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలకు పూర్వ వైభవం తీసుకొస్తామని పట్టణ పార్టీ అద్యక్షుడు షేక్‌ నాగూర్‌ మీరాన్‌ అన్నారు. పట్టణంలోని వివిధ వార్డుల్లో చేపట్టిన వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమాన్ని సోమవారం ఆయన పర్యవేక్షించి మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం వైయస్సార్‌ పథకాలకు పేర్లు మార్చి మభ్యపెడుతుందని, ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారన్నారు. వైయస్సార్‌ కుటుంబంలో చేరేందుకు ఉత్సాహం చూపడం శుభ పరిణామమన్నారు. ఈ సందర్బంగా బూత్‌ కమిటీ సభ్యులు ఇంటింటికి తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతేగాక రాజన్న పథకాల లబ్థిని అడిగి తెలుసుకోవడంతో పాటు చంద్రబాబు నాయుడు ఎన్నికల హమీల వైఫల్యాలను వివరించారు. ఈ సందర్బంగా సభ్యత్వం నమోదు చేయించారు. ఆయనతో పాటు మున్సిపల్‌ ఫ్లోర లీడర్‌ చల్లంచర్ల సాంబశివరావు, ఆకుల హనుమంతరావు, అచ్చ్యుత శివప్రసాద్, ఎస్‌.ఎం.యూనస్, సయ్యద్‌ ఖాజా,వల్లెం నరిసింహరావు, శిరిగిరి వెంకట్రావు, షేక్‌ నాగుర్‌బాషా, కొమ్మారెడ్డి సాయి, తదితరులు ఉన్నారు.

2019 ఎన్నికలే లక్ష్యం.............
2019 ఎన్నికల్లో వైయస్సార్‌సీపీ విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుకు సాగాలని వైయస్సార్‌ సీపీ మండల పార్టీ అద్యక్షుడు రాయపాటి పురుషోత్తమరావు పిలుపునిచ్చారు. మండలంలోని పలు గ్రామాల్లో బూత్‌ కమిటీ సభ్యులతో ఇంటింటికి పర్యటించారు. పురుషోత్తమరావు మాట్లాడుతూ... వై.యస్‌.జగన్‌ మ్యుమంత్రి అయితేనే సమస్యలు పరిష్కారమవుతాయని, టీడీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేఖ విధానాలను వివరిస్తూ ప్రజలను చైతన్య పరచాలని సూచించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమానికి జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన ‘నవరత్నాలు’ పథకం ప్రయోజనాలను వివరించాలని, ప్రతి ఇంటికి పథకం ఫలాలు చేరుతాయనే భరోసా ప్రజలకు కల్పించాలని చెప్పారు. ఈసందర్భంగా వైయస్సార్‌ కుటుంబంలో సభ్యత్వ నమోదు చేయించారు. కార్యక్రమంలో యూత్‌ సెల్‌ మండల అధ్యక్షుడు కళ్ళం విజయ భాస్కర్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్‌ కమిటి మాజీ చైర్మన్‌ కట్టా సంబయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Back to Top