మ‌హిళా హాస్ట‌ల్ లో పురుషులు


నాగార్జున యూనివర్శిటీ) రిషితేశ్వ‌రి ఆత్మ‌హ‌త్య చేసుకొన్న నాగార్జున యూనివర్శిటీలో అక్ర‌మాలు ఒక్కొక్క‌టిగా వెలుగు చూస్తున్నాయి. ర్యాగింగ్‌, ప్రేమ పేరుతో వేధింపుల‌తో ఆర్కిటెక్చ‌ర్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య చేసుకొన్న విష‌యం తెలిసిందే. సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్ బాబూరావు వ్య‌వ‌హారం, లేడీస్ హాస్ట‌ల్ నిర్వ‌హ‌ణ మీద ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. చివ‌ర‌కు ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేసిన ప్ర‌భుత్వం, వీసీ ని కూడా మార్చేసింది. అద‌న‌పు బాద్య‌త‌లుగా ఐఎఎస్ అధికారి ఉద‌య‌ల‌క్ష్మికి  ఈ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. వీసీ బాద్య‌త‌లు స్వీక‌రించిన ఉద‌య‌లక్ష్మి క్యాంప‌స్ లో ప‌ర్య‌టించారు. లేడీస్ హాస్ట‌ల్ కు వెళ్లిన‌ప్పుడు అక్కడ అనేక స‌మ‌స్య‌లు బ‌య‌ట ప‌డ్డాయి. అక్క‌డ పురుష సిబ్బంది ప‌నిచేయ‌టంపై ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ ప‌ద్ద‌తుల్ని మార్చాల‌ని అధికారుల్ని ఆదేశించారు. 
Back to Top