గెలుపు ఓటములు సహజం

నెల్లూరు: క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, పోటీల్లో క్రీడా స్ఫూర్తి చాటాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు డాక్టర్‌ అనీల్‌కుమార్‌యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలు అన్నారు. నెల్లూరు నగరంలోని వీఆర్‌సీ గ్రౌండ్‌లో నెల్లూరు ప్రీమియం లీగ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్‌ టోర్నమెంట్‌ను ఎమ్మెల్యేలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..క్రీడలు శారీరక బలానికే కాకుండా, మానసిక వికాసానికి తోడ్పడుతాయని చ్పెరు. 8 రోజుల పాటు నిర్వహించే ఈ టోర్నమెంట్‌లో విజేతలకు రూ.25 వేల నగదు బహుమతి అందజేయడం అభినందనీయమన్నారు. అనంతరం టోర్నమెంట్‌ నిర్వాహకులు విక్రమ్, రేవంత్‌లను ఎమ్మెల్యేలు అభినందించారు.

Back to Top