వైయస్‌ జగన్‌ను కలిసిన గీత కార్మికులుతూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం ఎ్రరపోతవరం వద్ద వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని గీత కార్మికులు కలిశారు. కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని చెప్పి చంద్రబాబు అమలు చేయలేదని గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదవశాత్తు చెట్టు మీద నుంచి జారిపడితే ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదని ఫిర్యాదు చేశారు. రుణాలు, పింఛన్‌ మంజూరు కావడం లేదని వైయస్‌ జగన్‌కు గీత కార్మికులు వివరించారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే గీత కార్మికులకు న్యాయం చేస్తామని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. 
 
Back to Top