గవర్నర్ ప్రసంగంలో కొత్తదనమేది?

హైదరాబాద్ 13 మార్చి 2013:

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభ సందర్భంగా రాష్ట్ర గవర్నరు నరసింహన్ చేసిన ప్రసంగం 2009లో చేసిన ప్రసంగానికి నకలుగా ఉందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ విమర్శించారు. వాస్తవానికి ప్రభుత్వ నిర్దేశం మేరకే గవర్నరు మాట్లాడతారన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన బుధవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. గవర్నరు ప్రసంగంలో  వాస్తవాలను మరుగు పరిచారన్నారు. ప్రభుత్వం సాధించిన విజయాలతో  పాటు వైఫల్యాలను కూడా ప్రసంగంలో పొందుపరచాలనీ, కానీ అలా జరగలేదనీ ఆయన ఎద్దేవా చేశారు. వాస్తవాలను ఎక్కడా ప్రతిబింబించలేదన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రవేశపెట్టిన విజన్ 20:20 డాక్యుమెంటులాగే గవర్నరు ప్రసంగం సాగిందన్నారు.

వృద్ధి రేటులో కొత్తగా సాధించిందేమిటి?
పన్నెండో వార్షిక ప్రణాళికలో పది శాతం అభివృద్ధి నమోదు చేస్తామన్నారు. పది, పదకొండో ప్రణాళికలలోనే వృద్ధి రేటులో మిగిలిన రాష్ట్రాలకంటే ఎంతో ముందనీ, ఇప్పుడు కొత్తగా సాధించామని చెప్పడానికి ఏమీ లేదనీ ఆయన ఎద్దేవా చేశారు. ఈ ఏడాది వృద్ధి రేటు సుమారు ఆరు శాతం పడిపోయింది. డాక్టర్ వైయస్ఆర్ అధికారంలో ఉండగా.. తొమ్మిది శాతం ఉంది. క్రమేపీ పెరిగి 12 శాతానికి పెరిగింది. ఇప్పుడు ఆరు శాతం ఉన్న వృద్ధి రేటును పది శాతానికి పెంచుతామనడాన్ని ఆయన ఎగతాళి చేశారు. వృద్ధి రేటును వ్యవసాయం, పరిశ్రమలపై ఆధారపడి ఉంటుంది. వీటి రేటు గణనీయంగా తగ్గింది. మహానేత సీఎంగా ఉండగా ఆరునుంచి ఏడు శాతానికి పెరిగి దేశంలో అత్యధిక వృద్ధి రేటు నమోదయ్యిందన్నారు. అప్పట్లో దేశం వృద్ధి రేటు రెండు శాతం ఉండేదని పేర్కొన్నారు. ప్రస్తుతం 1.9 శాతానికి పడిపోయిందన్నారు. దీనిని పెంచడానికి ప్రత్యేకంగా చేసిన కృషి ఏదీ లేదని కొణతాల మండిపడ్డారు.

ఈ బడ్జెట్‌తో అభివృద్ధి అసాధ్యం
విద్యుత్తు రాయితీలను ఆరు నుంచి పదివేలకు పెంచామని చెబుతున్నారు గానీ, నీలం తుపాను ఆ తదుపరి వచ్చిన రెండు తుపాన్ల నేపథ్యంలో సబ్సిడీ ఇచ్చిన దాఖలాలు లేవని చెప్పారు. ఏదో నామమాత్రంగా అక్కడక్కడా ఇచ్చారన్నారు. కనీస మద్దతు ధర(ఎమ్ఎస్‌పీ) విషయానికి వస్తే 25 శాతం పెరిగిందన్నారు. ఎరువుల ధరలు రెండు వందల శాతం పెరిగాయి. ఈ పెంపుతో వ్యవసాయం వృద్ధి చెందే పరిస్థితి కనిపించడం లేదని చెప్పారు. వ్యవసాయదారులకు వడ్డీ లేని రుణాలిస్తామని గవర్నరు తన ప్రసంగంలో చెప్పారనీ, కేంద్ర ప్రభుత్వం నాలుగు శాతం వడ్డీతో రుణాలు ఇస్తున్నందున ఇక్కడ వడ్డీలేని రుణాలివ్వడానికి నాలుగు వేల కోట్ల రూపాయలు కేటాయించాలనీ కొణతాల అభిప్రాయపడ్డారు. కిందటేడాది వ్యవసాయానికి కేవలం 650 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారని చెప్పారు. ఇంత తక్కువ కేటాయిస్తూ నూటికి నూరు శాతం వడ్డీలేని రుణాన్ని ఇస్తున్నట్లు చెప్పడం ఎంతవరకూ సమంజసమని ఆయన ప్రశ్నించారు. గతంలో వ్యవసాయానికి ఏడు గంటల పాటు నిరంతర విద్యుత్తు సరఫరా అయ్యేదనీ, ఇప్పుడు రెండు మూడు గంటలకూడా సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదనీ తెలిపారు.

విద్యుదుత్పాదన లోటు ఎలా పూడుస్తారో చెప్పలేదు
చిన్న, మధ్య తరహా పరిశ్రమలు లక్షలాదిగా మూతపడే పరిస్థితులున్నాయనీ, తత్ఫలితంగా లక్షలాదిమంది రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్తు తెస్తామని చెబుతున్నారు తప్పితే పరిస్థితిని బాగుచేసేందుకు యత్నించడం లేదన్నారు. సౌర విద్యుత్తు అంశంలో 20 ప్రీ క్లోజర్ ఫ్యాక్టర్ మించి లేదన్నారు. దీనివల్ల రెండు వందల మెగావాట్లు మాత్రమే లబ్ధి పొందుతామన్నారు. నాలుగు వేల మెగావాట్ల విద్యుదుత్పాదన లోటుందనీ, దీనిని ఏరకంగా పూడ్చుకునేదీ గవర్నరు ప్రసంగంలో చెప్పలేదని విమర్శించారు. థర్మల్ విద్యుదుత్పత్తి కూడా క్రమేపీ తగ్గుతోంది తప్ప పెరిగే అవకాశాలు కనిపించడం లేదన్నారు. కిందటేడాది 80వేల మిలియన్ టన్నుల బొగ్గును దిగుమతి చేసుకున్నారని తెలిపారు. ఈ ఏడాది ఇది 185వేల మిలియన్ టన్నుల బొగ్గును దిగుమతి చేసుకోవలసి వస్తుందనీ, కానీ ఇందుకు అవసరమైన విదేశీ నగదు నిల్వలు లేవనీ కొణతాల చెప్పారు. ఇప్పటికే ఫారిన్ ఎక్స్చేంజిలో 5.5శాతం లోటుందనీ, చరిత్రలో ఎప్పడూ ఇలాంటి పరిస్థితి లేదనీ పేర్కొన్నారు. ఒకవేళ బొగ్గును దిగుమతి చేసుకున్నా ధర కారణంగా దానిని విద్యుదుత్పత్తికి వినియోగిస్తే గిట్టుబాటయ్యే పరిస్థితులు లేవని అభిప్రాయపడ్డారు.

డీజిల్‌పై వ్యాట్ పెంచి కొత్త పరిశ్రమలను అడ్డుకున్నారు
గ్యాస్ అంశంలో ప్రస్తుతమున్న ప్రాజెక్టులలో మూడు వేల మెగావాట్ల విద్యుదుత్పత్తికి అవసరమైనవి మూతపడ్డాయని తెలిపారు. ఈ పరిస్థితిని అధిగమించడానికి చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా గవర్నరు ప్రసంగంలో కనిపించలేదన్నారు. చిన్న,మధ్య తరహా పరిశ్రమల మనుగడకు విద్యుదుత్పత్తి చేసి వాటికి సరఫరా చేయాలని కోరుతూ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ ముఖ్యమంత్రికి లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. విద్యుదుత్పత్తి మెరుగుపడేలోగా డీజీలుపై వ్యాట్ రద్దు చేయాలని కోరినప్పటికీ ఎటువంటి చర్యా తీసుకోలేదని చెప్పారు. జనరేటర్లు పెట్టుకుని చిన్నచితకా పరిశ్రమలు నడుపుకుందామంటే డీజిలుపై వ్యాట్‌ను 5 నుంచి 14 శాతానికి పెంచుతూ ఇటీవల తీసుకున్న నిర్ణయం అశనిపాతమైందని ఆయన తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో అభివృద్ధి ఏరకంగా సాధ్యమనే అనుమానం ప్రజలలో నెలకొందన్నారు. దివంగత మహానేత డాక్టర్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు చేపట్టిన పథకాలనే మళ్ళీ మళ్ళీ రాసుకుని చదివారు తప్ప గవర్నరు ప్రసంగంలో కొత్తదనం ఏమీ లేదని కొణతాల వివరించారు.

గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం శూన్యం
కొత్తగా చేపట్టిన కార్యక్రమం ఇదని చెప్పినది ఏమీ లేదన్నారు. వ్యవసాయ రంగంలో ప్రస్తుతం 2009నాటి పరిస్థితే ఉందని పేర్కొన్నారు. ప్రాణహిత చేవెళ్ళ, పోలవరం ప్రాజెక్టులకు జాతీయ హోదా సాధనలో విఫలమయ్యారన్నారు. నాలుగేళ్ళ క్రితం మహానేత ఈ రెండు ప్రాజెక్టులకూ జాతీయ హోదాకు సంబంధించిన అన్ని ప్రయత్నాలూ చేశామని చెప్పారనీ, అవే మాటల్ని ఇప్పుడు గవర్నరుతో చిలకపలుకుల్లా పలికించిందని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. మహిళలకు వడ్డీలేని రుణాలిస్తామన్న వాగ్దానమూ నెరవేరుతున్నట్లు లేదన్నారు. ప్రగల్భాలు పలకడం, చంద్రబాబులా అభూత కల్పనలు చెప్పడం తప్ప సాధించిందేమీ లేదన్నారు. కొత్త పరిశ్రమలకోసం ఒప్పందాలు కుదుర్చుకుని 41వేల మందికి ఉద్యోగాలొస్తాయని చెప్పారనీ, ఉన్న పరిశ్రమలు మూత పడుతున్న అంశాన్ని పట్టించుకోలేదనీ తెలిపారు.  

శాంతిభద్రతల క్షీణతకు కారణం ప్రభుత్వ వైఫల్యమే
శాంతిభద్రతల పరిస్థితులు నానాటికీ క్షీణిస్తున్నాయన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. అధికారాన్ని కాపాడుకుని ఐదేళ్ళూ కొనసాగాలనే యత్నం తప్ప ప్రజల గురించి ఆలోచించిన దాఖలా లేదని చెప్పారు.  వృద్ధాప్య పింఛన్లు పెంచే అంశాన్ని కూడా ప్రసంగంలో ప్రస్తావించలేదన్నారు. కొత్తగా రేషను కార్డులివ్వడంనుంచి ఏ విధమైన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావించలేదన్నారు. అన్ని ప్రభుత్వ పథకాలను నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తున్నారు. రాజీవ్ యువకిరణాలు పేరుపెట్టి ప్రగల్భాలు పలికారనీ, ఏడాదికి ఐదు లక్షల ఉద్యోగాలిస్తామన్నారనీ, దాని పురోగతి కూడా

విశ్వాస తీర్మానమైనా పెట్టు బాబూ!
ప్రధాన ప్రతిపక్షం అవిశ్వాసం పెట్టే సంప్రదాయం ఉందనీ, అవిశ్వాస తీర్మానం ప్రభుత్వాన్ని పడగొట్టడానికే మాత్రమే కాదనీ చిక్కుల్లో పెట్టడానికీ ఉపయోగించుకోవచ్చని కొణతాల ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.  ప్రధాన ప్రతిపక్షమే పెట్టనందున ఎవరు అవిశ్వాసం పెట్టినా మద్దతివ్వడంలో తప్పులేదన్నారు. కిందటి అసెంబ్లీలో టీడీపీకి 30మంది సభ్యులే ఉన్నప్పటికీ ఆయన అవిశ్వాసం పెట్టారనీ, ఆ విషయం ఆయనకు గుర్తులేదా అని ప్రశ్నించారు. ఎవరో లబ్ధి పొందుతారని తాను అవిశ్వాసం పెట్టనని చంద్రబాబు చెప్పడాన్ని ఎద్దేవా చేశారు. కనీసం విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని బాబుకు సూచించారు.

ప్రభుత్వాన్ని కాపాడుతున్నదెవరో  అందరికీ తెలుసు
ఈ ప్రభుత్వాన్ని కాపాడుకొస్తున్నది ఎవరనేది అందరికీ తెలుసని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యి సాగిస్తున్న వ్యవహారాలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారన్నారు. గతంలో టీడీపీ అవిశ్వాసం ప్రవేశ పెట్టినప్పుడు తాము మద్దతిచ్చిన విషయాన్ని కొణతాల గుర్తుచేశారు. శాసన సభ పని కాలంలో బడ్జెట్ కీలకమైన ఘట్టమనీ, దానికి హాజరు కాకుండా ఉండడమంటే ఆయన విజ్ఞతను గమనించవచ్చన్నారు. దీన్ని బట్టే ప్రభుత్వంతో ఎవరు కుమ్మక్కయ్యారో అర్థమవుతోందని స్పష్టంచేశారు.

Back to Top