ప్రజల గుండెల్లో రాజన్న ముద్ర పదిలం

వైయస్‌ఆర్‌ పథకాలు ప్రతీ గడపకు అందాయి
వైయస్‌ఆర్‌ సీపీ తెలంగాణ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి
హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ ఇప్పటికీ.. ఎప్పటికీ తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని వైయస్‌ఆర్‌ సీపీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతీ గడపలో.. గడపలోని ప్రతీ కుటుంబసభ్యుడికి అందాయని గుర్తు చేశారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయంలో జరిగిన జయంతి వేడుకల్లో గట్టు శ్రీకాంత్‌రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. రాజన్న రాజ్యం రావాలంటే వైయస్‌ జగన్‌ అన్నతోనే సాధ్యమన్నారు. వైయస్‌ఆర్‌ ఆశయ సాధన కోసం అహర్నిశలు కష్టపడుతున్న నాయకుడు వైయస్‌ జగన్‌ అన్నారు. తెలంగాణలో పథకాలకు పేరుమారినా అవన్నీ వైయస్‌ఆర్‌ తీసుకొచ్చినవేనని గుర్తు చేశారు. రాష్ట్రంలో వేరే కొత్త పథకాలు ఏవీ రూపొందించలేదన్నారు. 1.70 లక్షల ఉద్యోగాలు ఇప్పటి వరకు భర్తీ చేయలేదన్నారు. మొన్నటి వరకు బీజేపీతో పొత్తుపెట్టుకొని ఆంధ్రరాష్ట్రాన్ని నిలువునా నాశనం చేసిన చంద్రబాబు ఇప్పుడు సిగ్గులేకుండా కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకునేందుకు సిద్ధమవుతున్నారని మండిపడ్డారు. ప్రజలంతా చంద్రబాబు నియంత వైఖరిని గమనించి రానున్న ఎన్నికల్లో వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని గెలిపించి సువర్ణ పాలనకు శ్రీకారం చుట్టాలని కోరారు. 
రాజన్న రాజ్యం వైయస్‌ జగన్‌తోనే సాధ్యం: రెహమాన్‌
ముస్లిం మైనార్టీల సంక్షేమానికి పాటుపడిన ఏకైక నాయకుడు వైయస్‌ రాజశేఖరరెడ్డి అని వైయస్‌ఆర్‌ సీపీ పార్టీ జాతీయ కార్యదర్శి రెహమాన్‌ అన్నారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్‌ కల్పించిన మహానుభావుడన్నారు. రాజన్న రాజ్యం కావాలంటే ప్రజలకు మేలు జరగాలంటే వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలన్నారు. రెండు రాష్ట్రాల ముస్లింలు ఏకమై వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గెలుపుకు కృషి చేయాలన్నారు. ఆరు నూరైనా వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. 
Back to Top