వైయస్‌ జగన్‌ యువతకు స్ఫూర్తిహైదరాబాద్‌: అతిచిన్న వయస్సులో యువతకు స్ఫూర్తి దాయకంగా నిలుస్తున్న ఏకైక నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజున వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గట్టు శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నో దుష్టశక్తులు అడ్డుపడుతున్నా.. అకుంటిత దీక్షతో ప్రజలతో మమేకమై, ప్రజల్లో ఉన్న ఏకైక నాయకుడు వైయస్‌ జగన్‌ అన్నారు. వైయస్‌ జగన్‌ నిండు నూరేళ్లు దేవుడి ఆశీర్వాదంతో సంతోషంగా జీవించాలని కోరారు. వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రజలంతా వైయస్‌ఆర్‌ సీపీతో కలిసి రావాలన్నారు. తెలంగాణ వ్యాప్తంగా వైయస్‌ జగన్‌ పుట్టిన రోజును ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. 
Back to Top