మిడ్ మానేరు ప్రాజెక్ట్ ను సందర్శించిన గట్టు

కరీంనగర్: మిడ్‌మానేరు ప్రాజెక్టును వైయస్‌ఆర్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి సందర్శించారు. మిడ్‌మానేరుకు పడిన గండిని పరిశీలించి బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శులు శివకుమార్, బోయినిపల్లి శ్రీనివాసరావు, మహేందర్‌రెడ్డి, మతిన్, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్ జిల్లాల అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు ఉన్నారు.
 
Back to Top