వైయ‌స్ఆర్‌ జయంతిని ఘనంగా నిర్వహిద్దాం


 
 హైదరాబాద్‌: దివంగత మహానేత డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖర రెడ్డి 69వ జయంతిని ఈ నెల 8న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో, గ్రామా ల్లో ఘనంగా నిర్వహించాలని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్‌ గట్టు శ్రీకాంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఏర్పా టు చేసిన వైయ‌స్ఆర్‌ విగ్రహాలను పూలమాలతో అలంకరించి, జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. అనంతరం రక్తదాన శిబిరాలు, అన్న దాన కార్యక్రమాలు, ఆస్పత్రుల్లో రోగులకు పండ్ల పంపిణీ వంటి పలు సేవా కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. ఈ నెల 8న ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించే వైయ‌స్ఆర్‌  జయంతి వేడుకలకు పార్టీకి చెందిన రాష్ట్ర నాయకులు, శ్రేణులు, అభిమానులు భారీగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.  


Back to Top