150 వాహనాల్లో హైదరాబాద్‌కు తరలిన గంగుల

కర్నూలు : వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు గంగుల ప్ర‌భాక‌ర్‌రెడ్డి, ఆయ‌న త‌న‌యుడు విజయేంద్రనాథ్‌రెడ్డి(నాని) భారీ కాన్వాయ్‌లో హైదరాబాద్‌కు తరలి వెళ్లారు. ఆళ్లగడ్డ నుంచి 150 వాహనాల్లో ప్రయాణాన్ని కొనసాగించిన ఆయనకు పుల్లూరు టోల్‌గేట్‌ దగ్గర వైయ‌స్‌ఆర్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాజా విష్ణువర్దన్‌రెడ్డి తన అనుచరులతో ఉదయం 12 గంటల ప్రాంతంలో ఘన స్వాగతం పలికారు. ముఖ్య నాయకులు, కార్యర్తలు జై జగన్‌..జై గంగుల అంటూ నినాదాలను హోరెత్తించారు. అంతకముందు ఉదయం 8 గంటల సమయంలో గంగుల ప్రభాకరరెడ్డి తన అనుచరులతో కలసి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని కలిసేందుకు 50 వాహనాల్లో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా గంగుల విజేయేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ..బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సమయంలో తమ కుటుంబ సభ్యులందరూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమ కుటుంబానికి మాటలు చెప్పి మోసం చేశారని, కార్యకర్తల అభిష్టం మేరకే పార్టీ మారనున్నట్లు వివరించారు. వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఎగుర వేస్తామని తెలిపారు. 

Back to Top