వైయస్‌ జగన్‌ను కలిసిన గంగనాపల్లి దళితులు


తూర్పు గోదావరి: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో వివిధ  వర్గాల ప్రజలు కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. బుధవారం వైయస్‌ జగన్‌ను గంగనాపల్లి దళితులు కలిశారు. తమ గ్రామంలో దళితులకు శ్మాశాన వాటిక లేదని, ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వైయస్‌ జగన్‌కు వివరించారు. కొంత మంది వ్యక్తులు తమ శ్మాశాన వాటికను ఆక్రమించుకుంటున్నారని వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. ఆక్రమించి శ్మాశాన వాటికను టీడీపీ నాయకులకు అమ్మారని తెలిపారు. శ్మాశాన వాటిక లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు తమ గోడు చెప్పుకున్నా పట్టించుకోలేదని తెలిపారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్‌ జగన్‌ మరో ఏడాది ఓపిక పడితే న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
 
Back to Top