వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా గంగ పూజోత్స‌వం

గుత్తి (అనంత‌పురం): గుత్తి పట్టణంలోని కోట‌వీధి సమీపంలో కొండపై ఉన్న కుంటలో బుధవారం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో గంగ పూజను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుంతకల్లు సమన్వయ కర్త వై. వెంకటరామిరెడ్డి హాజరైయ్యారు. ఈ సందర్భంగా కౌన్సిలర్‌ నజీర్‌ మాట్లాడుతూ 15 సంవత్సరాల తర్వాత కుంట నిండిందన్నారు. కుంటలోకి నీళ్లు రావడంతో కోట వాసులందరూ ఆనందంగా ఉన్నారన్నారు. ఆంజనేయస్వామి మాలాధారుడు వైవీఆర్‌ చేత పూజ చేయిస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో గంగ పూజోత్సవాన్ని నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్‌ పట్టణ కార్యదర్శులు బేల్దారి చంద్ర, అరటి పండ్ల చంద్ర, వెంకటేష్, నియోజకవర్గం అధికార ప్రతినిధి దశరథ రామిరెడ్డి సీనియర్‌ నాయకులు సుంకప్ప, ఎద్దుల శంకర్, బాషా, జీపు రమణ తదితరులు పాల్గొన్నారు.

Back to Top