బాల వినాయకుడి వార్షికోత్సవ వేడుకల్లో బొడ్డేడ ప్రసాద్‌

మునగపాక: విశాఖ జిల్లా మునగపాక మండలంలోని అరబుపాలెం గ్రామంలోని బాల వినాయక ఆలయం వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి.  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త బొడ్డేడ ప్రసాద్‌ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని బాల వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. బొడ్డేడ వెంట సర్పంచ్‌ లంబా అప్పారావు, వాడ్రాపల్లి మాజీ సర్పంచ్‌ కాండ్రేగుల నూకరాజు, గ్రామపెద్దలు బొడ్డేడ శ్రీనివాసరావు, పాలునాయుడు తదితరులు ఉన్నారు. 

Back to Top