మునిగిపోయినా సరే పరిహారం ఇచ్చేదాకా కదిలేది లేదు

కొండాపురం: వైయస్సార్ జిల్లా కొండాపురం మండలం చవటపల్లె గ్రామస్తుల ఆందోళన కొనసాగుతోంది. ఆర్ అండ్ ఆర్ ప్రకారం పరిహారం ఇస్తామని చెప్పిన చంద్రబాబు...గ్రామంలోని ఇళ్ల చుట్టూ నీరు చేరుతున్నా పరిహారంపై ఉలుకూపలుకూ లేకపోవటంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. న్యాయమైన పరిహారం ఇవ్వకుంటే కదిలేది లేదంటూ వారు మంగళవారం ఉదయం నుంచి కడప-తాడిపత్రి జాతీయరహదారిపై చేపట్టిన ధర్నా.. నేడు కొనసాగుతోంది. గండికోట రిజర్వాయరులో ముంపునకు గురయ్యే ఆరు గ్రామాల్లో చవటపల్లె మొదటిది. గత రెండు నెలల నుంచి అవుకు రిజర్వాయరు నుంచి గండికోటకు నీరు వచ్చి చేరుతోంది. తమకు పరిహారం ఇస్తే సంతోషంగా ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతామని.. లేకుంటే తాము మునిగినా సరే కదిలేది లేదని స్పష్టం చేస్తున్నారు. రోడ్డుపైనే వంటావార్పూ చేపట్టారు. రాత్రి సమయమంతా అక్కడే గడిపారు. నేడు కూడా రోడ్డుపైనే తమ ధర్నా కొనసాగిస్తున్నారు.

Back to Top