జాతిపితకు ఘన నివాళి

 


హైదరాబాద్‌: జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నెల్లూరు జిల్లా సైదాపురంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి, అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి తదితరులు గాంధీజీకి ఘన నివాళులర్పించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ, మల్లాది విష్ణు తదితరులు మహాత్ముడికి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయా ప్రాంతాల్లో కూడా జాతిపితకు వైయస్‌ఆర్‌సీపీ నేతలు నివాళులర్పించారు.
 
Back to Top