పేదల జీవితాలతో చెలగాటమా..?

  • ఆక్వాపార్కులను రద్దు చేయాలి
  • అన్నింటినీ సముద్రతీరానికి తరలించాలి
  • ఐదుగురిని బలితీసుకున్న యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి
  • నరసాపురంలో ఆక్వా బాధిత కుటుంబాలను పరామర్శించిన వైయస్ జగన్
మొగల్తూరుః ఆక్వాఫుడ్ ప్రాజెక్ట్ లు వద్దని గ్రామస్తులు సంవత్సరన్నర కాలంగా ఉద్యమిస్తున్నా వినకుండా ప్రభుత్వం వారి జీవితాలతో చెలగాటమాడుతోందని వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మండిపడ్డారు. మొగల్తూరులో ఆనంద్ ఆక్వాఫ్యాక్టరీలో రసాయనాలు క్లీన్ చేస్తుండగా ఐదుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో తీవ్ర దిగ్ర్భాంతి చెందిన వైయస్ జగన్ హుటాహుటిన నరసాపురం చేరుకొని ప్రభుత్వాసుపత్రిలో మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే....

ఆక్వాఫుడ్ పార్కు మాకు వద్దని తుందుర్రులో సంవత్సరన్నర కాలంగా గ్రామస్తులు ఉద్యమిస్తున్నారు. సముద్రతీరంలో పెట్టమని గ్రామస్తులు గొడవలు చేస్తున్నారంటే కారణం మీకందరికీ అర్థమైవుంటుంది.   చనిపోయినోళ్లంతా 20 నుంచి 30 ఏళ్ల లోపు పిల్లలు. వాళ్లకు చిన్నచిన్నపిల్లలున్నారు. మొగల్తూరులో ఉన్న ఆక్వా  ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కేవలం 30 టన్నులు. ఇదే యాజమాన్యం తుందుర్రులో 351 టన్నులతో అంటే పదింతలు కెపాసిటీతో పార్కు నిర్మిస్తోంది. చంద్రబాబు, కలెక్టర్ లు  పైప్ వేస్తామని, జీరో పొల్యూషన్ అని  బుల్డోజ్ చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ లో ఫ్రాన్స్ తలలను వేస్ట్ కింద పక్కనపడేసి పంటకాల్వలోకి వదిలిపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఆ కాల్వలు డ్రైనేజీ మాదిరిగా తయారై తాగడం సంగతి దేవుడెరుగు వ్యవసాయం కూడా చేయలని పరిస్థితికి పంట కాల్వలు తీసుకు పోతున్నారు. ఇటీవల ప్రభుత్వంపై ఒత్తిడి రావడంతో పది రోజులు ఆపి అక్కడే పెట్టారు. అది డీకంపోజ్ అయి అమ్మోనియా బయటకొచ్చి ఐదుగురు మనుషులను బలితీసుకుంది.  మేము వస్తున్నామని గొడవ పెద్దదవుతుందని భయపడి ఏకంగా యూనిట్ ను సీజ్ చేశారు.  ట్యాంకులు క్లీన్ చేసి మళ్లీ పంటకాల్వల్లోకి పంపిస్తున్నారు బాబు, కలెక్టర్ , పోల్యూషన్ కంట్రోల్ బోర్డు అందరికీ తెలిసినా ప్రజలను మభ్యపెడుతూ చెవిలో పువ్వులు పెడుతున్నారు. పొల్యూషన్ ను పంట కాల్వలో వేయడం మూలాన ఐదుమంది చనిపోయిన సంగతి మనకళ్లముదే కనిపిస్తుంటే పొల్యూషన్ లేదని ఏరకంగా చెబుతారు.  20లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తున్నారు. పేదల చావుకు కారణమైన యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి.  యాజమాన్యం దగ్గర్నుంచి ఇంకా ఎక్కువగా పరిహారం ఇవ్వడంతో పాటు ఇన్సూరెన్స్ అమౌంట్ వచ్చేలా ప్రభుత్వం చూడాలి. ప్రభుత్వానికి, యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడవద్దు.  బాబుకు, ఫ్యాక్టరీ యాజమాన్యానికి చెబుతున్నా ఫ్యాక్టరీని రద్దు చేయండి. సముద్రతీరంలో మాత్రమే వచ్చేట్టుగా చర్యలు తీసుకోండి. అప్పుడే అందరికీ మంచిది.  

ఆక్వా పార్కుల కారణంగా తాగునీళ్ల సంగతి దేవుడెరుగు అన్నీ డ్రైన్స్ అయిపోయి వ్యవసాయానికి కూడా పనికిరాని పరిస్థితి. ఒక్కో ప్రాణానికి 15లక్షలు వెలకట్టి ప్రాజెక్ట్ లు కట్టుకుంటా పోతే మా జీవితాలను డబ్బులతో వెలకడతారా అని బాధిత కుటుంబాలు అడుగుతున్నారు. ఇంత పెద్ద ఘటన జరిగితే యాజమాన్యాన్ని ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయడం లేదు. ఇలాంటివి పునరావృత్తం కాకుండా చర్యలు తీసుంటామని ఎందుకు చెప్పడం లేదు.  ఫ్యాక్టరీలను రద్దు చేసి సముద్రతీరానకి తరలిస్తామని ఎందుకు చెప్పడం లేదు. గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అన్నింటినీ సముద్ర తీరానికి తరలించాలి. పనిచేస్తే తప్ప తిండి దొరకని వారి జీవితాలతో చెలగాటం ఆడడం సమంజసమేనా..?. మీడియా కూడా తన వంతు పోషించాలి. ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని చూపాలి. బాధిత కుటుంబాలకు 25లక్షలకు పైగా పరిహారం ఇవ్వడంతో పాటు ఇన్సూరెన్స్ కూడా ఇవ్వాలి. 

Back to Top