గండ్రపై సుజయకృష్ణ మండిపాటు

విజయనగరం, 15 మే 2013:

బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణరంగారావు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాలనే  కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని తెలిపారు. తనపై విప్ ధిక్కారం నోటీసు కింద చర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. అవిశ్వాసం కంటే ముందే రాజీనామా చేసిన తనపై ఏవిధంగా చర్యలు తీసుకుంటారని  ఆయన ప్రశ్నించారు. అటువంటి చర్య రాజ్యాంగ విరుద్ధమనీ, ఏడాది గడువుండగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఉప ఎన్నికలుండవన్న ఈసీ వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీలు నాటకాలాడుతున్నాయని ఆరోపించారు. విచారణకు స్పీకర్ ఎదుట హాజరయ్యేది లేదని సుజయకృష్ణ రంగారావు స్పష్టం చేశారు.

తాజా ఫోటోలు

Back to Top