బాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలి

రాష్ట్రాన్ని అవినీతి మయం చేశాడు.. ఏపీ పరువు తీశాడు
స్వర్ణాంధ్రప్రదేశ్ ను స్కామ్ ఆంధ్రగా మార్చాడు
ప్రపంచంలోనే ఈ స్థాయి అవినీతి ఎక్కడా లేదు
ఉపన్యాసాలివ్వడం తప్ప ప్రజలకు ఒక్క మంచిపనైనా చేశావా 
చంద్రబాబుపై ధ్వజమెత్తిన శ్రీకాంత్ రెడ్డి

హైదారాబాద్ః స్వర్ణాంధ్రప్రదేశ్ ను చంద్రబాబు స్కామ్ ఆంధ్రగా మార్చాడని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రాన్ని అవినీతి మయం చేసిన చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఉపన్యాసాలివ్వడం తప్ప ప్రజలకు ఉపయోగపడే ఒక్క పనైనా చేశారా అని చంద్రబాబును నిలదీశారు.  ఏపీ ప్రజలు తలదించుకునే పరిస్థితులు తీసుకొచ్చారని మండిపడ్డారు. కిందిస్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి ఫైరయ్యారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే అవినీతిపరుడైతే ప్రజలు ఇంకెవరికి చెప్పుకుంటారని శ్రీకాంత్ రెడ్డి వాపోయారు. 

విజయవాడలో అక్రమ కట్టడంలో నివాసముంటూ చంద్రబాబు అవినీతికి తెరలేపారని శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను హింసించడం, బలవంతంగా భూములు లాక్కోవడం,  బెదిరించడం...ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపితే అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మాట్లాడడం చంద్రబాబుకు అలవాటైపోయిందని శ్రీకాంత్ రెడ్డి దుయ్యబట్టారు. మీ జేబులు నింపుకోవడం కోసమే ప్రాజెక్ట్ లు టేకప్ చేస్తున్నారు. ఈ రకమైన అవినీతి ప్రపంచంలోనే ఎక్కడా జరగలేదని శ్రీకాంత్ రెడ్డి బాబుపై ధ్వజమెత్తారు.  

చంద్రబాబు పట్టిసీమతో రాయలసీమకు నీళ్లిస్తానని మభ్యపెట్టావ్. పోలవరానికి నష్టం చేకూర్చావ్. రాయలసీమకు చుక్కనీరైనా ఇచ్చావా బాబు..? 200 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా శ్రీశైలంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి.  డ్యాంలో 854 అడుగుల లెవల్ మెయింటైన్ చేస్తేనే... వెనుకబడిన ప్రాంతాలకు మేలు జరుగుతుందని  తాము గొంతు చించుకున్నా పట్టించుకోలేదు. 790 అడుగులు చేసి అందులో ఉన్న కొద్దో గొప్పో నీళ్లు  కూడా ఇతర ప్రాంతాలకు తరలించుకుపోయావ్ . ఈరకంగా సీమ ప్రజల గొంతుకోశావ్. రాయలసీమకు చుక్క నీరు ఇవ్వని నీవు ఆప్రాంత ప్రజలకు క్షమాపణ చెప్పాలని శ్రీకాంత్ రెడ్డి బాబును తూర్పారబట్టారు.  

విజయవాడలో అక్రమ కట్టడంలో నివాసముంటూ పార్టీసమావేశాల్లోగే మంత్రివర్గ సమావేశాలు నిర్వహిస్తున్నాడు. ఏది కేబినెట్ మీటింగో, పార్టీ మీటింగో తెలియని పరిస్థితి. ఇలాంటి మంత్రివర్గ సమావేశాలు నిర్వహించడం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేదు. బాబును సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎన్నికల్లో వందలాది వాగ్దానాలు ఇచ్చారు. ఒక్కటైనా నెరవేర్చారా . రుణాల మాఫీ లేదు. మహిళలు, నిరుద్యోగులను పట్టించుకుంది లేదు. కొత్త ఉద్యోగాల ఊసేలేదు. ప్రతిదాంట్లో అవినీతి. ఇరిగేషన్ , నీరు, బొగ్గు, సూర్యుడు పంచభూతాలను దోచేస్తున్నారు. రాష్ట్రాన్ని అవినీతిమయం చేసి దేశంలో ఏపీ పరువు తీశావు. నీను నిప్పు అని మాట్లాడుతున్నావ్. ఏరకంగా  నిప్పో తనను తాను ప్రశ్నించుకోవాలని శ్రీకాంత్ రెడ్డి బాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  

ప్రపంచంలోనే ఏపీని నం.1 చేస్తానని మాట్లాడుతాడు. జపాన్ పోతాడు. ఏపీని జపాన్ లాగ చేస్తానని మాట్లాడుతాడు. సింగపూర్ పోయి, ఏపీని సింగపూర్ చేస్తానంటాడు. ఏమీ చేయకుండా బాబు తన వ్యక్తులకు లబ్దిపొందేలా భూములు కొనిచ్చి రైతుల గొంతు కోశాడని శ్రీకాంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. బాబు శంకుస్థాపనలకే ప్రాధాన్యం ఇస్తాడని..అవి పూర్తి చేసేందుకు నిధులు కేటాయించే తత్వం కాదని తాము ముందునుంచి ప్రశ్నిస్తూనే ఉన్నామని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

ప్రతి జిల్లాకు ఐటీ పార్క్, యూనివర్సిటీ,  పుట్ పార్క్ తీసుకొస్తానంటూ ఏవేవో మాట్లాడాడు. ఇలా ప్రజలను మోసగిస్తూ ఎందుకు గొంతు కోస్తున్నావ్. విభజనతో నష్టపోయిన ఏపీ ప్రజలను నీ తప్పిదాలతో పూర్తిగా నష్టపరుస్తున్నావ్.  కులాల మధ్య చిచ్చుపెడుతున్నావ్. రాష్ట్రంలో ఏం జరిగినా వైఎస్ జగన్ చేశాడని మాట్లాడుతావ్. మంచి అయితే చంద్రబాబు, మంచి జరగపోతే వైఎస్ జగన్ ను ఆడిపోసుకుంటావా అంటూ శ్రీకాంత్ రెడ్డి బాబుపై ధ్వజమెత్తారు. హైదరాబాద్ లో అమెజాన్, గూగుల్ లాంటి సంస్థలు పెట్టుబడులకు ముందుకు వస్తుంటే ..ఇక్కడ పారిశ్రామిక సమ్మిట్ లంటూ చంద్రబాబు వందల కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు. 

ప్రపంచమంతా నా వైపే చూస్తుంది. ప్రపంచానికి నీనే పాఠాలు చెప్పానని మాట్లాడుతాడు. రాష్ట్రంలో అన్ని వర్గాలను మోసగించి...తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు ఎమ్మెల్యేలను కొంటున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహించారు. తెలంగాణలో ఎమ్మెల్యేలను పశువులను కొన్నట్టు కొంటున్నారని మాట్లాడిన చంద్రబాబు...ఇక్కడ చేస్తున్నదేంటని ప్రశ్నించారు.  తన అవినీతి, అక్రమాలపై నిలదీస్తే అక్రమ కేసులు పెట్టడం..ఛానళ్లను మూసేయిస్తానంటూ బెదిరించడమే పనిగా పెట్టుకున్నారని చంద్రబాబుపై శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. ఇలా చేస్తే ప్రజలు తిరుగుబాటు చేయడం ఖాయమన్నారు. ప్రజల తరపున, ప్రభుత్వ తప్పులపై  వైఎస్ జగన్ నాయకత్వంలో అసెంబ్లీలో పోరాడుతామని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. 

Back to Top